డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, వ్యాపారవేత్త హీరానందానీకి లాగిన్ పాస్‌వర్డ్ ఇచ్చినట్లు అంగీకరించారు.
తాను చనిపోతూ 48 మంది ప్రాణాలను ఓ బస్సు డ్రైవర్ కాపాడాడు. గుండెపోటు రావడంతో వేగంగా వెళ్తున్న బస్సును ఆ డ్రైవర్ కట్టడి చేశాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
కేరళలోని ఎర్నాకులంలోని కన్వెన్షన్ సెంటర్‌లో క్రైస్తవుల ప్రార్థనా సమావేశంలో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం.
శ్రీలంక సముద్ర జలాల్లో 37 మంది భారతీయ జాలర్లను సముద్ర సరిహద్దు నిబంధనలు పాటించలేదనే కారణంతో లంక అధికారులు అరెస్టు చేశారు. దీంతోపాటు ఐదు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిలో దాదాపు మొత్తం తమిళనాడు వాసులే ఉన్నారని తెలుస్తోంది.
కేరళ కొచ్చిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా కావాలనే చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
పారా ఏషియన్ గేమ్స్‌లో శీతల్ దేవి గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె ప్రతిభను చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్య పోయారు. తమ కంపెనీకి చెందిన కారును ఇస్తానని.. ఏ కారు కావాలో కోరుకోవాలని అడిగారు. ఆ కారును శీతల్‌కు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ప్రకటించారు.
ఓ తండ్రి తన కొడుకును అమ్మకానికి పెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అలీగఢ్ ప్రాంతంలో తన కుమారుడ్ని అమ్ముకుంటున్న ఫోటోను ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఇక 50 ఏళ్లపైబడిన పోలీసులు రిటైర్మెంట్ తీసుకోనున్నారు. వారికి నిర్బంద పదవీ విరమణ ఇవ్వనున్నట్లుగా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సామర్థ్యం లేనివారిని తొలగించి వారి స్థానంలో సమర్థులైన వారిని నియమించే ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది.
పార్లమెంట్‌లో డబ్బు తీసుకుని ప్రశ్నలు అడిగారని టిఎంసి ఎంపి మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ నాయకుడు శుక్రవారం కేరళలోని మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ నిర్వహించిన ర్యాలీకి హాజరైనట్లు సమాచారం.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న ఆనియర్ ధరలు.. సామాన్యులకు అందేలా కనిపించడంలేదు.
ప్రియుడ్ని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ (Bangladeshi woman) అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది.
దీపావళికి ముందే ప్రధాని మోడీ శుభవార్త ప్రకటించారు. శనివారం( 2023 అక్టోబరు 28) జరిగే ఉపాధి మేళాలో ప్రభుత్వ శాఖల్లో నియమితులైన 51,000 మంది యువతకు నియామక పత్రాలను ఆయన పంపిణీ చేయనున్నారు.
దేశ రాజధాని నడిబొడ్డున డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ను కారు ఢీ కొంది. దీంతో ఆ కానిస్టేబుల్ ఎగిరి పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం,.. ప్రకాష్ ఝా ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తేజశ్వి ప్రసాద్ ఈ సినిమాకు పెట్టుబడి పెడుతున్నాడని, దానికి డబ్బు కూడా ఇచ్చాడని వార్తలు వచ్చాయి.