»Man Forced To Put His Son On Sale To Repay Loan In Uttar Pradeshs Aligarh
UttarPradesh: అప్పు తీర్చేందుకు కొడుకును అమ్మకానికి పెట్టిన తండ్రి
ఓ తండ్రి తన కొడుకును అమ్మకానికి పెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అలీగఢ్ ప్రాంతంలో తన కుమారుడ్ని అమ్ముకుంటున్న ఫోటోను ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి తన కొడుకును అమ్మాలనుకున్నాడు. కుటుంబంతో కలిసి రోడ్డుపై కూర్చుని తన కొడుకుని అమ్మకానికి పెట్టాడు. తన కుమారుడిని అమ్మాలనుకుంటున్నట్లు ఓ బోర్డు కూడా రాసి పెట్టుకున్నాడు. ఆ బోర్డును తన మెడలో వేసుకుని నిల్చున్నాడు (My son is for sale). ఈ దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అలీగఢ్ బస్టాండ్‌కు సమీపంలో ఈ కుటుంబం రోడ్డుపై ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఖిలేష్ యాదవ్ షేర్ చేసిన ఫోటో:
ये है भाजपा का अमृतकाल जब एक पिता अपने पुत्र को बेचने के लिए गले में तख़्ती लटकाकर बिलखने को मजबूर है।
इससे पहले कि ये तस्वीर दुनिया भर में फैल जाए और प्रदेश के साथ-साथ देश की छवि संपूर्ण विश्व में धूमिल करे, कोई तो सरकार को जगाए। pic.twitter.com/hZsKY3Hwa7
ఆ వ్యక్తి తన బంధువు నుంచి రూ.50,000 వరకూ అప్పు చేయగా అది కాస్తా తీర్చకపోవడంతో పెద్ద గొడవ అయ్యింది. ఈ తరుణంలో తన కుటుంబంతో కలిసి ఆ వ్యక్తి రోడ్డున పడ్డాడు. తన కుమారుడ్ని బలవంతంగా అమ్మేందుకు ప్రయత్నించాడు. తనకు ఉన్న అన్ని అప్పులు ఎనిమిది లక్షల వరకూ ఉంటాయి. అంత డబ్బుకే తన కుమారుడ్ని అమ్మకానికి పెట్టాడని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు.
సమస్యను పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూపీలో ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. సీఎం యోగి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డాడు. అలీగఢ్‌కు చెందిన నిస్సహాయుడైన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకుంటానంటూ మెడలో బోర్డు పెట్టుకుని రోధిస్తున్న ఫోటోను ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యి రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్టను దిగజార్చకముందే ఎవరైనా ప్రభుత్వాన్ని మేల్కొల్పండని ఎక్స్ వేదికగా విమర్శించారు.