Dutyలో ఉన్న పోలీసును ఢీ కొన్న కారు, ఎగిరిపడ్డ కాప్.. ఎక్కడంటే..?
దేశ రాజధాని నడిబొడ్డున డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ను కారు ఢీ కొంది. దీంతో ఆ కానిస్టేబుల్ ఎగిరి పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
Delhi Cop Tossed In Air: పోలీసుల విధి నిర్వహణ కత్తి మీద సామే.. ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితిలోనైనా సరే డ్యూటీ చేయాల్సింది. నేతల కోసం బందోబస్త్.. గొడవ జరిగితే శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడం.. మద్యం సేవించి ప్రాణాలు తీసుకోవద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అలా టెస్ట్ చేస్తోండగా.. ఓ పోకిరి తన కారుతో గుద్దేశాడు.
కన్నాట్ ప్లేస్ వద్ద మంగళవారం రాత్రి ఓ కానిస్టేబుల్ (constable) డ్యూటీ చేస్తున్నాడు. వాహనాలను ఆపి.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అంటే అర్ధరాత్రి 1 గంటకు ఓ ఎస్యూవీ (SUV) నేరుగా అతని వద్దకు వచ్చింది. దూరం నుంచి స్లోగా రాగా.. దగ్గరికి వచ్చే కొద్ది స్పీడ్ పెరిగింది. అక్కడ తనిఖీలు చేస్తోన్న కానిస్టేబుల్ను ఢీ కొంది. ఆ కారు వేగానికి అక్కడ ఉన్న బ్యారికేడ్ల నుంచి దూసుకెళ్లింది. కానిస్టేబుల్ (constable) అయితే ఎగిరి కింద పడ్డాడు.
#WATCH | CCTV footage shows a Delhi Police personnel hit by an SUV and thrown into the air in the Connaught Place area
The incident happened on the intervening night of 24th-25th October. Police detained the car driver and action was taken against him.
చెక్ పోస్ట్ (check post) వద్ద మరో వాహనాన్ని కూడా ఎస్యూవీ ఢీ కొంది. ఎగిరి పడటంతో కానిస్టేబుల్ (constable) తల, కాలుకి గాయం అయ్యింది. వెంటనే అతనిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ (discharge) చేయడంతో ఇంటికి తీసుకెళ్లారు. కానిస్టేబుల్ను (constable) ఢీ కొని ఆ కారు అలానే వెళ్లింది. మిగతా పోలీసులు ఆ కారును వెంబడించి డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత పారిపోయేందుకు డ్రైవర్ (driver) ప్రయత్నించాడని.. తాము పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేశామని.. విచారణ జరుగుతోందని వివరించారు.