హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhwinder Singh) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి తీవ్ర కడుపు నొప్పి (Abdominal pain) రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలించారు. స్టమక్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సీఎంకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించినట్లు సిమ్లా(Shimla)లోని ఐజీఎంసీలో సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు వెల్లడించారు. అల్ట్రాసౌండ్ (Ultrasound) రిపోర్ట్ సహా అన్ని పరీక్షల్లోనూ అంతా నార్మల్గానే ఉందని పేర్కొన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. కాగా, ఇటీవల ధర్మశాల(Dharamshala)లో జరిగిన ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ను సీఎం సుఖు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డాలతో కలిసి స్టేడియంలో వీక్షించారు.