»Viral Video Of Farmers Throwing Apples In The Canal Shimla Himachal Pradesh
Viral video: యాపిల్స్ ను కాలువలో పారబోసిన రైతులు
పలువురు యాపిల్(apples) రైతులు యాపిల్స్‌ను కాలువలో కుప్పులు కుప్పులుగా పడేస్తున్నారు. ఎంటని ఆరా తీస్తే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రోడ్ల పనులు ఆటంకంగా మారాయని వాపోయారు. అనేక రోజులుగా ఈ పనులు పెండింగ్ ఉన్న క్రమంలో యాపిల్స్ పాడైపోతున్నాయని, అందుకే పడేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని(himachal pradesh) సిమ్లా(shimla) జిల్లా ఎగువ ప్రాంతం మధ్యలో యాపిల్ సీజన్ జోరందుకుంది. కానీ పలువురు రైతులు మాత్రం వారి యాపిల్(apples) పంటను కాలువలో పడేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు ఇప్పటికీ మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో పలు చోట్ల రోడ్లను పునరుద్ధరించకపోవడంతో తోటల నుంచి సేకరించిన యాపిల్ కుళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని పడేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో పలువురు రైతులు యాపిళ్లను నీటిలో పోయడం కనిపిస్తుంది. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్‌లోని బాలసన్ గ్రామం అని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన పలువురు బీజేపీ రాజకీయ నేతలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రైతుల బాధలు కనిపించడం లేదా అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చేతన్ సింగ్ బ్రగ్తా సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చాలా బాధాకరమని ఆ ప్రాంతంలో 20 రోజులుగా రోడ్డు తెరవలేదని, దీంతో ప్రజలు విక్రయించే యాపిల్స్ మార్కెట్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
पुरी साल बागवान अपनी फसल को तैयार करने के लिए कड़ी मेहनत करता है,और अगर उसकी फसल का अंत ऐसा हो तो ये अत्यंत पीड़ादायक है। हम लगातार सरकार से सेब कलेक्शन सैंटर खोलने और सम्पर्क मार्गो को बहाल करने का आग्रह कर रहे है। लेकिन सरकार इस ओर ध्यान नही दे रही है जिस कारण बागवान अपना सेब… pic.twitter.com/H5nhyqFSBq
ఇప్పటికి యాపిల్స్ మండీలకు చేరాల్సి ఉందని, అయితే అలా జరగలేదన్నారు. ఇది దురదృష్టకరం. పైగా ముఖ్యమంత్రి నిన్న అప్పర్ సిమ్లాను సందర్శించాల్సి ఉంది. కానీ అతని హెలికాప్టర్ ఎగరలేకపోయింది. అందుకే ఆయన సందర్శించలేకపోయారు. హెలికాప్టర్ ఎగరకపోతే మీరు మీ పర్యటన చేయలేరని వ్యాఖ్యలు చేశారు. మీరు రోడ్డు మార్గంలో వచ్చి ఉంటే, ఎగువ సిమ్లాలోని తోటమాలికి మనోబలం పెరిగి ఉండేదని అన్నారు. హిమాచల్ ప్రభుత్వం పని చేస్తున్న తీరు చూస్తే హిమాచల్ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించడంలో విఫలమైందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో సిమ్లా జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లోని రహదారులను వీలైనంత త్వరగా తెరిచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.