»Sensational Things Come To Light In The Case Of Kerala Bomb Blasts
Martin : కేరళ బాంబు పేలుళ్ల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
కేరళలోని కొచ్చిలో జరిగిన పేలుళ్లతో రాష్ట్రం మొత్తం ఉళిక్కిపడింది. ఎర్నాకుళం జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మూడు పేలుళ్లలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తానే సూత్రధారిణని డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి దాడి జరిగిన అనంతరమే హొస్సూర్ పోలీసుల ముందు లొంగిపోయారు.
యూట్యూబ్ (Youtube) లో వీడియోలు చూసి..ఇంట్లోనే పేలుడు పదార్థాలతో తానే బాంబులు తయారు చేశానని కేరళ బాంబు (Kerala bomb) నిందితుడు ఒప్పుకుడున్నాడు. బాంబుల తయారికి మూడు వేల రూపాయల ఖర్చు అయినట్లు నిందితుడు మార్టిన్ పోలీసులు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు మార్టిన్ నివాసంలో సోదాలు నిర్వహించారు.కేరళ(Kerala)లోని కలమసేరిలోని కన్వెన్షన్ సెంటర్లో ఓ క్రిస్టియన్ ప్రార్థనా మందిరానికి చెందిన కన్వెన్షన్ హాల్ లో బాంబు పేలిన ఘటనలో మొదట ఒకరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.
దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు (Police) విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్లకు ఉపయోగించిన ఐఈడీ బాంబులను నిందితుడు స్వయంగా తయారు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతను దుబాయి లో పనిచేస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకున్నానని తెలిపారు.కరోనా మహమ్మారి సమయంలో, మార్టిన్ ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా పని చేయడానికి దుబాయ్(Dubai)కి వెళ్లాడని జలీల్ చెప్పాడు. అతని కుమారుడు బ్రిటన్‌లో చదువుతుండగా, అతని కుమార్తె కొచ్చిలో చదువుతోంది. కలమసేరిలోని అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో జరిగిన పలు పేలుళ్లలో 50 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో ఐఈడీ ప్రయోగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.