Heart Attack : కరోనా వైరస్ కారణంగా దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సంచలన వ్యాఖ్య చేశారు. ఇంతకుముందు కోవిడ్ సోకి తగ్గిపోయిన వారే ఎక్కువగా దీని బాధితులు అయ్యారన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తులు గుండెపోటును నివారించడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఎక్కువగా కష్టపడవద్దన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ‘గర్బా’ ఆడుతున్నప్పుడు సంభవించిన మరణాల్లో ఎక్కువ మందికి గుండె సంబంధింత సమస్యల కారణంగానే చనిపోయారన్నారు. ఎక్కువగా గుజరాత్ లోనే ఈ మరణాలు సంభవించాయి. దీని తర్వాత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ పటేల్ ‘కార్డియాలజిస్ట్’లతో సహా వైద్య నిపుణులతో సమావేశమయ్యారు. పటేల్ మరణాలకు కారణాలు, చికిత్సను కనుగొనడానికి డేటాను సేకరించాలని నిపుణులను కోరారు. ఇంతలో గుండెపోటు కేసులు పెరగడానికి కరోనా వైరస్ ప్రధాన కారణమని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటన విడుదల చేశారు.
చదవండి:Premam director: సినిమాల నుంచి తప్పుకున్న హిట్ మూవీ డైరెక్టర్..?
కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటు కేసులు పెరిగాయని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో డాక్టర్ అజిత్ జైన్ చెప్పారు. రోగులను పరీక్షించగా, కరోనా వైరస్ కారణంగా గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. అందువల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బంది పడుతోంది. దీంతో వారికి గుండెపోటు వస్తోంది. గడ్డకట్టడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ అని తెలిపారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఏ వయస్సులో ఉన్న వారికైనా శరీరంలో ఈ గడ్డలు ఏర్పడుతున్నాయి. సఫ్దర్జంగ్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తులు భారీ వ్యాయామాలు చేయడం మానుకోవాలని చెప్పారు. అలాంటివారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వ్యాయామం చేయాలి. ఎందుకంటే వ్యాయామం చేసే సమయంలో శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఉంటుంది. గుండె కూడా వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయడం ప్రారంభిస్తుంది. కరోనా లేదా మరేదైనా కారణాల వల్ల గుండెలో రక్తం గడ్డకట్టినట్లయితే, భారీ వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
చదవండి: Ratan Tata: రషీద్ ఖాన్కు పది కోట్లు రివార్డుపై స్పందించిన రతన్ టాటా

