»Ratan Tata Reacts To The Ten Crore Reward For Afghanistans Top Cricketer Rashid Khan
Ratan Tata: రషీద్ ఖాన్‌కు పది కోట్లు రివార్డుపై స్పందించిన రతన్ టాటా
అఫ్ఘనిస్థాన్ టాప్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారని నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. పాక్‌పై అఫ్ఘన్ విజయం సాధించిన సందర్భంగా రషిద్ గురించి ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
Ratan Tata reacts to the ten crore reward for Afghanistan's top cricketer Rashid Khan
Ratan Tata: అఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Afghan cricketer Rashid Khan)కు ప్రముఖ భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ ఇటీవల నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా రతన్ టాటా స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆ వార్తలను కొట్టిపారేశారు. అలాంటి ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ఏ ఆటగాడి జరిమానా గురించి తాను ఐసీసీ (ICC)కి ఎలాంటి సూచనలు చేయలేదన్నారు. తాను ఏ ఆటగాడికీ రివార్డు ప్రకటించలేదన్నారు. క్రికెట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏదైనా ఉంటే ఆయనే స్వయంగా సమాచారం ఇస్తానని, ఇలాంటి ఫార్వర్డ్ మెస్సెజ్‌లను నమ్మొద్దని రతన్ టాటా (Ratan Tata) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023)లో భాగంగా పాకిస్థాన్‌పై అఫ్ఘన్ (AFG vs PAK) భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అఫ్ఘన్ సెలబ్రేషన్స్‌లో క్రికెటర్ రషీద్ ఖాన్ భారత జెండాను పట్టుకుని కనిపించారు. దీంతో అతడికి ఐసీసీ రూ.55 లక్షలు జరిమానా విధించిందని నెటిజన్లు నెట్టింట్ల పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి రతన్ టాటా రషీద్‌కు రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారని రాసుకొచ్చారు. అది సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తలను రతన్ టాటా కొట్టిపారేశారు.