»Anand Mahindra Said Goodbye To Premier Padmi Taxis
Mumbai : ప్రీమియర్ పద్మి’ ట్యాక్సీలకు గుడ్ బై చెప్పిన ఆనంద్ మహీంద్రా
ముంబై వాసులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఈ కాలీ పీలి ట్యాక్సీలే సేవలు అందించేవి. బ్లాక్, ఎల్లో రంగులతో కనిపించే ఈ కార్లు పద్మినీ కంపెనీవి. కాలం చెల్లిన ప్రీమియర్ పద్మినీ ట్యాక్సీలు చాలా కాలంగా నడుస్తున్నాయి. నేటితో వీటికి ముంబై వాసులు వీడ్కోలు పలుకుతున్నారు.
మంబై (Mumbai) ఈ పేరు వినగానే అందరికీ సాధాణరంగా గుర్తుకు వచ్చేది నలుపు, పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. దాదాపు 60ఏళ్లుగా అవి ముంబైతో బలమైన బంధాన్ని పెనవేసుకున్నాయి.’ప్రీమియర్ పద్మిని(Premier Padmini)’గా పిలవబడే ఈ ‘కాళీ-పీలీ’ టాక్సీలు.. ఇక మీదట ముంబై రోడ్ల మీద కనపడవు.దాదాపు ఆరు దశాబ్దాల పాటు ముంబై రోడ్ల రయ్.. రయ్ మంటూ తిరిన ఈ ట్యాక్సీలు అక్టోబర్ 30 నుంచి కనపడవు.ముంబైలో క్యాబ్‌ల కాల పరిమితి 20 ఏళ్లు. దీంతో డీజిల్ వెర్షన్ అయిన ‘ప్రీమియర్ పద్మి’ ట్యాక్సీలు క్రమంగా నిష్క్రమిస్తూ వస్తున్నాయి. ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సైతం ఈ అంశంపై తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక పోస్ట్ పెట్టారు.
‘‘నేటి నుంచి ఐకానిక్ పద్మిని ప్రీమియర్ ట్యాక్సీ(Taxi) ముంబై రోడ్ల నుంచి కనుమరుగు అవుతోంది. ఇవి శిథిలావస్థకు చేరాయి. అసౌకర్యమైనవి. పెద్దగా శబ్దం చేస్తుంటాయి. లగేజీ పెట్టుకోవడానికి పెద్దగా చోటు కూడా ఉండదు. కానీ, నా లాంటి పాతకాలపు వారికి అవి టన్నుల కొద్దీ జ్ఞాపకాలు పంచాయి. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కు మమ్మల్ని చేర్చాయి. గుడ్ బై అండ్ అల్వీదా, కాలీ-పీలి ట్యాక్సీలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ చేశాడు స్పందనను తెలియజేశారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చూసిన యూజర్లలో మరి కొందరు కూడా ఈ ట్యాక్సీలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
దాదాపు 60ఏళ్ల పాటు ముంబై వాసులకు సేవలందించిన ‘ప్రీమియర్ పద్మి’ ట్యాక్సీని గుర్తుగా రోడ్డుపై లేదా మ్యూజియం(Museum)లో భద్రపరచాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.’ప్రీమియర్ పద్మి’ ట్యాక్సీలు రోడ్లపై నిష్క్రమించినప్పుటీకీ.. ముంబై ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని పరేల్ నివాసి, కళా ప్రేమికుడు ప్రదీప్ పలావ్ అన్నారు.అయితే ట్సాక్సీ డ్రైవర్ యూనియన్లు మాత్రం.. ‘ప్రీమియర్ పద్మి’ ట్సాక్సీలు బంద్ కావడానికి ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తున్నాయి.గతంలో తాము ప్రభుత్వానికి చెప్పినా.. పట్టించుకోలేదని ముంబై టాక్సీమెన్స్ యూనియన్ పేర్కొంది.