Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అతను దుబ్బాక నియోజవర్గ పరిధిలోని సూరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో అతనికి కడుపు భాగంలో గాయమైనట్లు సమాచారం. గాయపడిన వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు, దాడి అనంతరం ఎంపీ కొత్తను ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతనిని హైదరాబాద్‌కు తరలించారు.