»Threat To Mukesh Ambani For The Third Time This Time Demand Of %e2%82%b9400 Crores
Mukesh Ambaniనీకి మూడోసారి బెదిరింపు..ఈ సారి ₹400 కోట్ల డిమాండ్
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వరుస బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగుతోంది. మెయిల్ పంపిన.. ఆగంతకులు తొలుత రూ.20 కోట్లు, రెండోసారి రూ.200 కోట్లు ముడో సారి 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు వచ్చాయి.ఈ సారి రూ.400 కోట్లు ఇవ్వాలని, లేకపోతే అంబానీని చంపేస్తామని గుర్తు తెలియని గుర్తు తెలియని వ్యక్తులు కంపెనీకి మెయిల్ (Mail) చేసినట్లు పోలీసులు గుర్తించారు.నాలుగు రోజుల వ్యవధిలో ఇలా బెదిరింపులు (Threats) రావడం మూడోసారి. మొదటి సారి రూ 20 కోట్లు డిమాండ్ చేయగా రెండోసారి 200 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు.నాలుగు రోజు క్రితం అంబానికి మెయిల్ చేసిన అజ్ఞాత వ్యక్తి.. తన బెస్ట్ షూటర్స్ ఉన్నారని.. తనకు 20 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని మెయిల్ చేశాడు. తాజాగా సోమవారం 400 కోట్లు ఇవ్వాలని మరో మెయిల్ చేశాడని అంబానీ కంపెనీ మంగళవారం తెలిపింది.
గతంలో ఇలాగే.. అంబానీని, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను బీహార్(Bihar)లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి(Mumbai)లోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని పేల్చివేస్తామని నిందితులు బెదిరించారు. 2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే వాహనం యజమాని మన్సుఖ్ హీరేన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఈ కేసు దర్యాప్తు (Case investigation) చేపట్టిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజేయే ప్రధాన సూత్రధారిగా తెలిపింది. దీంతో వాజేను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రం భద్రత కల్పిస్తోంది.