»Poetry Speech At Oxford University Kcr Abhinava Chanakya Is The Book
Oxford యూనివర్సిటీలో కవిత ప్రసంగం..కేసీఆర్ అభినవ చాణక్య అని కితాబు
తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ (Telangana) అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్‌పై ఆమె కీలకోపన్యాసం చేశారు.
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అతి తక్కువ సమయంలో ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) ‘ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌క్లూసివ్ డెవలప్మెంట్-ది తెలంగాణ మాడల్’ అనే అంశంపై కవిత (MLC Kavitha) కీలకోపన్యాసం చేశారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆమె తెలిపారు.ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్‌తో సఫలం అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తుచేశారు.
ఆ తర్వాత కేసీఆర్ (CMKCR) ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని చెప్పారు.ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)ను పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పునరుద్ఘాటించారు.పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని, టీఎస్ ఐపాస్ (TS iPass) విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని. ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు.యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్ (Hyderabad) లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు.