Jammu & Kashmir Migrant labourer from UP shot dead by terrorists in Pulwama
Jammu&Kashmir: జమ్మూ కశ్మీర్(Jammu&Kashmir)లోని పుల్వామా(Pulwama)లో ఒక కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. తీవ్ర రక్త స్రావంతో అతను మరణించాడని కశ్మీర్ పోలీసులు సోమవారం ధృవీకరించారు. మరణించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలసకూలి ముఖేష్‌గా గుర్తించారు. అప్రమత్తం అయిన బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి భద్రతను పెంచినట్లు తెలిపారు. ఆదివారం ఈద్గా క్రికెట్ మైదానంలో డాక్టర్ మస్రూమ్ అహ్మద్ వాణి క్రికెట్ ఆడుతున్న సమయంలో జమ్మూకశ్మీర్ పోలీసులకు, లష్కరే తోయిబా ఉగ్రవాది గ్రూప్‌కు నడుమ కాల్పులు జరిగాయి. ఉగ్రదాడిలో వాణి కూడా గాయపడ్డారు. అతని కళ్లు, పొట్ట, మెడపై ఓ టెర్రరిస్ట్ మూడుసార్లు కాల్పులు జరిపాడు. ఆపరేషన్ అనంతరం వాణి పరిస్థితి విషయంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
సోమవారం జరిగిన వలస కార్మికుడిపై ఉగ్రదాడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వాణిపై దాడి తర్వాత పుల్వామాలో భద్రతా దళాలు వాహనాలు, పాదాచారుల తనిఖీలను ముమ్మరం చేశామని స్థానిక ఇన్స్పెక్టర్ తెలిపారు. శ్రీనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు నగరంలోని ఎగ్జిట్ పాయింట్ల వద్ద మొబైల్ వెహికల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేటి ఉదయం కుప్వారా జిల్లాలో సరిహద్దు రేఖను ఒక ఉగ్రవాది దాటడానికి ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు చొరబాటుదారున్ని హతమార్చడం ద్వారా వారి ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కెరాన్ సెక్టార్‌లోని జుమాగుండ్ ప్రాంతంలో చొరబాటు బిడ్ ఆదివారం రాత్రి విఫలమైంది. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో జరిపిన సోదాల్లో ఉగ్రవాది మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.