»A Husband Who Divorced His Wife Because She Got Eyebrows Done A Shocking Incident In Kanpur
Kanpur : ఐబ్రోస్ చేయించుకుందని భార్యకు విడాకులిచ్చిన భర్త
సౌదీఅరేబియాలో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేశాడు. కాల్ మాట్లాడుతుండగా…అతని చూపు భార్య కనుబొమ్మలపై పడింది.భార్య ఐబ్రోస్ చేయించుకుందని భార్త విడకులు ఇచ్చాడు
యూపీ (UP)లోని కాన్పూర్‌లో విచిత్ర ఘటన జరిగింది. సౌదీఅరేబియాలో ఉంటున్న సలీం కాన్పూర్‌లో ఉంటున్న తన భార్యా గుల్సాబాకు వీడియో కాల్ చేశాడు. ఆమె ఐబ్రోస్(Eyebrows)చేయించుకుందని గుర్తించి, తనకు ఇష్టంలేని పని ఎందుకు చేశావని ప్రశ్నించాడు.ఆ వీడియో కాల్‌లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు. నా అనుమతి లేకుండా ఎందుకు చేయించుకున్నావని శివాలెత్తాడు. ఆగ్రహంతో ఊగిపోయి తలాక్ చెప్పి.. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కాన్పూర్(Kanpur)కు చెందిన గుల్సాబాకు.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మహ్మద్ సలీంతో 2022 జనవరిలో వివాహమైంది. కొద్ది నెలల తర్వాత భార్యను ఇక్కడే వదిలిపెట్టి ఉపాధికోసం సలీం సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో అక్టోబరు 4న భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆమె ఐబ్రోస్ షేప్ చేయించుకున్నట్టు గుర్తించాడు. తన ఇష్టానికి విరుద్దంగా, తనతో చెప్పకుండా ఎందుకు పార్లర్‌కు వెళ్లావని నిలదీశాడు. ఆవేశంతో అప్పటికప్పుడే గుల్సాబా(Gulsaba)కు తలాక్ చెప్పి.. ఇక నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చని అన్నాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది. భర్త సలీం, అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులపై వేధింపుల ఆరోపణలు చేసింది. తన అత్తమామలు కూడా కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. గుల్సాబా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దేశంలో ట్రిపుల్ తలాక్(Triple Talaq)ను 2019లో నిషేధించిన కేంద్రం.. ఇందుకోసం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం భార్య ఇష్టానికి విరుద్దంగా మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకుంటే మూడేళ్ల జైలు శిక్ష, దానితోపాటు జరిమానా కూడా విధిస్తారు.