»Good News For Indians Without Visa Fee Visit Thailand November 10th To May 10th 2024
Visa free: భారతీయులకు గుడ్ న్యూస్..వీసా లేకుండానే థాయిలాండ్
మరికొన్ని రోజుల్లో మీరు థాయిలాండ్(thailand) టూర్ వెళ్లనున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజులు వీసా లేకుండానే థాయిలాండ్‌లో పర్యటించవచ్చని ఆ దేశ అధికారులు ప్రకటించారు. అంతేకాదు 30 రోజుల పాటు అక్కడ ఉండే అనుమతి కూాడా ఉందన్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Good news for Indians without visa visit Thailand november 10th to may 10th 2024
టూరిజం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో అనేక మంది పర్యాటకులను ఆకర్షించేందుకు పలు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఎక్కువగా టూరిజంపై ఆధారపడిన థాయిలాండ్(thailand) కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశం, తైవాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు వీసా ఫ్రీ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 10 నుంచి మే 10 వరకు ఈ రెండు దేశాల ప్రయాణికులు థాయ్‌లాండ్‌కి వీసా లేకుండానే రావచ్చని అక్కడి ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ తెలిపారు. అయితే వారి దేశంలో టూరిజాన్ని పెంపొందించే లక్ష్యంతో కేబినెట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ఇక ప్రస్తుతం ఒక భారతీయుడు థాయ్‌లాండ్‌కు వెళ్లాలనుకుంటే, అతను 2 రోజుల థాయ్‌లాండ్ వీసా కోసం 2000 భాట్ అంటే దాదాపు 57 డాలర్లు చెల్లించాలి. అయితే తాజా నిర్ణయం ద్వారా పెద్ద ఎత్తున భారత్ నుంచి టూరిస్టులు రావడం ద్వారా థాయిలాండ్ ప్రభుత్వం విదేశీ పర్యాటకుల(tourism) ఆదాయాన్ని 3.3 ట్రిలియన్ భాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రయాణ పరిశ్రమకు స్వల్పకాలిక ఆర్థిక ఉద్దీపన లభిస్తుందని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ డేటా ప్రకారం పర్యాటకం GDPలో 12% ఉండగా.. ఉద్యోగాలలో ఐదవ వంతుకు దోహదం చేస్తుంది.
ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం జనవరి నుంచి అక్టోబర్ 29 మధ్య థాయిలాండ్ దేశానికి 22 మిలియన్ల సందర్శకులు వచ్చారు. దాని ద్వారా ప్రభుత్వానికి 927.5 బిలియన్ భాట్ ($25.67 బిలియన్ల) ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత ఇండియా(india) టూరిజం పరంగా థాయ్ లాండ్ కు నాలుగో పెద్ద మార్కెట్ గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సుమారు 28 మిలియన్ల ముంది టూరిస్టులను ఆకర్షించాలని అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.