»After Kerala Zika Virus Alert In Karnataka Spread By Mosquitoes Know Remedy And Prevention
Zika Virus: కర్ణాటకను హడలెత్తిస్తున్న జికా వైరస్
నిన్న మొన్నటి వరకు కేరళను జికా వైరస్ వణికించింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలో దోమలలో జికా వైరస్ కనుగొన్నారు. దాని వ్యాప్తి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Zika Virus: నిన్న మొన్నటి వరకు కేరళను జికా వైరస్ వణికించింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలో దోమలలో జికా వైరస్ కనుగొన్నారు. దాని వ్యాప్తి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో జికా వైరస్ దోమల్లో కనిపించింది. బెంగళూరు పక్కనే ఉన్న చిక్కబల్లాపూర్లో దోమల్లో జికా వైరస్ సోకినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్ఎస్ మహేష్ తెలిపారు. ఆగస్టు నెలలో పరీక్షల కోసం దోమల నమూనాలను సేకరించారు. జికా వైరస్ కనుగొనబడిన దోమను తాలకబెట్ట నుండి సేకరించారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ, ‘మా శాఖ ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. మేము సేకరించిన నమూనాలలో కొన్ని జికా పాజిటివ్‌గా గుర్తించబడ్డాయి. చిక్కబల్లాపూర్లో జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న దోమలు బయటపడ్డాయి. మాకు సుమారు 10 రోజుల క్రితం నివేదిక అందింది, అప్పటి నుండి మేము అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటివరకు ఎవరికీ వ్యాధి సోకలేదు. ఇది అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం.’ అన్నారు.
జికా వైరస్‌పై రాష్ట్రవ్యాప్త ప్రచారంలో ఆగస్టులో సేకరించిన నమూనాల నివేదిక అక్టోబర్ 25న విడుదలైంది. చిక్కబల్లాపూర్ జిల్లా తాలకబెట్ట చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో జ్వర పీడితులందరినీ నిశితంగా విశ్లేషిస్తున్నామని, తీవ్ర జ్వరం వచ్చిన ముగ్గురు రోగుల నమూనాలను పరీక్షలకు పంపామని డీహెచ్ఓ ఎస్ఎస్ మహేష్ తెలిపారు. విశేషం ఏమిటంటే ప్రస్తుతం ముగ్గురు రోగుల పరిస్థితి నిలకడగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 నమూనాలను సేకరించగా, అందులో 6 చిక్కబల్లాపూర్కు చెందినవి. వీరిలో ఐదుగురికి నెగెటివ్ వచ్చినప్పటికీ ఒక నమూనాలో జికా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరుసగా 3 రోజులు జ్వరంతో బాధపడేవారు ముందుకు వచ్చి రక్త నమూనాలు ఇవ్వాలని DHO కోరారు. జికా వైరస్‌తో సంక్రమణ లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి.