»Salaar Movie December 22 Next 50 Days Movie Release Fans Waiting
Salaar: రాకకు 50 రోజులే..ఈసారైనా హిట్టు పడేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. థియేటర్లోకి రావడమే లేట్.. బాక్సాఫీస్ బద్దలవుతుందని అంటున్నారు ప్రభాస్
ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
బాహుబలి తర్వాత వరుసగా మూడు ఫ్లాప్‌లు అందుకున్నాడు ప్రభాస్(prabhas). సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ సలార్. కెజియఫ్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్.. మోకాలి సర్జరీ కోసం విదేశాల్లో ఉన్నాడు. నవంబర్ ఫస్ట్ వీక్ లో ప్రభాస్ ఇండియా రానున్నట్టుగా తెలుస్తోంది. అలాగే.. సలార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఓ రేంజ్లో నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు. నవంబర్ సెకండ్ వీక్ వరకు ట్రైలర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిలింస్ వారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిగ్గా మరో యాభై రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోందని ట్వీట్ చేశారు మేకర్స్. దీంతో.. యాభై రోజుల్లో బాక్సాఫీస్ బద్దలవనుందని..సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ మాస్ సినిమాలో హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హోంబలే ఫిలింస్ వారు దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో సలార్(salaar)ను నిర్మిస్తున్నారు. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా నటిస్తున్నారు.మరి భారీ అంచనాలున్న సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.