Vyooham Movie: ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ కొత్త మూవీ వ్యూహం సినిమాకు (Vyooham Movie) సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సినిమాకు సెన్సార్ సర్టిపికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇందుకు గల కారణం వ్యూహం సినిమాలో నిజ జీవితంలో ఉన్న పాత్రల పేర్లను వాడటమే.. దానిపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిపికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. మూవీ రిలీజ్ కావాలంటే సెన్సార్ సర్టిఫికెట్ కంపల్సరీ.. యూ, యూ/ఏ, ఏ సర్టిపికెట్లను ఇస్తారు. ఆ రేటింగ్ ఆధారంగా సినిమాలు చూసేవారు ఎంపిక చేసుకోవచ్చు. వ్యూహం మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడంతో మూవీ మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. తమకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు.