విపక్షనేతల ఐఫోన్లకు హ్యాకింగ్ అలెర్ట్ రావడంతో కేంద్ర ప్రభుత్వమే తమ మైబైల్స్ను హ్యక్ చేశారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. అంతేకాదు యాపిల్ యాజమన్యం సైతం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
Apple responded to the hacking alert of the iPhones of the opposition MPs
Hacking Alert: దేశవ్యాప్తంగా పలువురు విపక్ష ఎంపీల(Opposition MPs) ఐఫోన్ల (iPhones)కు హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ (Apple ‘hacking’ alert)లు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వంలో పనిచేసే హ్యాకర్లే మీ ఫోన్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే సందేశంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను ట్రాప్ చేస్తుందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ మెసేజ్లు ఎక్స్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో ఈ వివాదంపై యాపిల్ (Apple) సంస్థ స్పందించింది. ఎలాంటి హ్యాకింగ్ ప్రయత్నం జరగలేదని, ఒక్కోసారి ఫేస్ అలెర్ట్లు వస్తుంటాయని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త పద్దతులను వాడుతున్నారని, వారి టెక్నాలజీని గుర్తించడం అప్పుడప్పుడు సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. నిఘా సంకేతాలు పటిష్టంగా ఉంటే హ్యకింగ్ను గుర్తించవచ్చని తెలిపింది. అయితే యాపిల్ ఫోన్లకు వచ్చే అలర్ట్ నోటిఫికేషన్లు ఒక్కొసారి ఫేక్ కూడా అవచ్చొని ప్రకటనలో స్పష్టం చేసింది. విపక్ష ఎంపీలకు ఆ హ్యాక్ అలర్ట్ మెసెజ్లు ఎందుకు వచ్చాయన్నది చెప్పలేమని, అలా బయటపెడితే భవిష్యత్తులో తమ నిఘా నుంచి హ్యకర్లు తప్పించుకునే అవకాశముందని వెల్లడించింది.
కాంగ్రెస్ నేతలు శశిథరూర్(Shashi Tharoor), పవన్ ఖేడా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా తదితర విపక్ష పార్టీల నేతల ఐఫోన్లకు మంగళవారం ఈ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేంద్రమే తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే ఇలాంటి మెసేజ్లు భారత్లోనే కాదు మొత్తం 150 దేశాల్లో కొందరి యూజర్లకు వచ్చినట్లు యాపిల్ తెలిపింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. విపక్షాల ఆరోపణలు కొట్టిపారేశారు. అప్పుడప్పుడు నకిలీవి వస్తుంటాయని, దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. ఈ మెసేజ్లు వచ్చినవారు దర్యాప్తునకు సహకరించాలని కేంద్రమంత్రి కోరారు.