ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ జేఎన్.1 ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకి దేశంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వేరియంట్ జేఎన్.1 తొందరగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చేరడానికి మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులు, 6 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 4 మంది రాష్ట్ర మంత్రులు ఉంటారు. మంత్రుల పూర్తి జాబితా ఇదే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగి.. సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సీట్లకోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఉద్యోగుల కోతకు తెరతీసింది. పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్ 97 కమ్మూనికేషన్‌లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎన్ని విపత్తులు వచ్చినా ఏళ్లపాటు తట్టుకుని నిలబడేలా డిజైన్ చేశారు.
జనవరి 6వ తేదిన ఆదిత్య ఎల్1 మిషన్ తన గమ్యస్థానానికి చేరుకోనుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
మహారాష్ట్రలోని షోలాపూర్ సహా అనేక ప్రాంతాల్లో జీతాల పెంపు సహా పెండింగ్ డిమాండ్ల కోసం రాష్ట్రంలోని రెండు లక్షల 10 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన చేపడుతున్నారు. గత 20 రోజులుగా వీరు సమ్మె కారణంగా అంగన్‌వాడీలన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. మరోవైపు చిన్నారుల విద్యకు ఆటంకం ఏర్పడుతుంది.
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. పీ చిదంబరం నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. 16 మంది సభ్యులను కూడా నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు.
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. నిన్న 640 కేసులు నమోదు కాగా..ఈరోజు గత 24 గంటల్లో కొత్తగా 752 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి.
బ్యాక్టీరియాకు నోబెల్ విజేత, 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా 'ప్లాంటోయా ఠాగూరై' అని నామకరణం చేసినట్లు విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం తెలిపింది.
శబరిమలకు నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో క్యూ లైన్లలో గంటల తరబడి అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
దేశంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం నాటికి గత 24 గంటల్లో కొత్తగా 640 కేసులు రికార్డయ్యాయి.
లారీ డ్రైవర్లపై ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. రాత్రి పూట డ్రైవ్ చేసే వారికి రోడ్డు పక్కన గల హోటళ్లు, దాబాలలో ఉచితంగా టీ అందజేస్తామని ప్రకటన చేసింది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది.
వరదల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వరద తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.