»Women Are Fighting Badly For Free Bus In Karnataka
Free Bus: దారుణంగా కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగి.. సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సీట్లకోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Women are fighting badly for free bus in Karnataka
Free Bus: ఫ్రీగా వస్తే దేనికైనా అంతూపోంతూ ఉండదు అని ఊరికే అనలేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్(Free Bus) అమల్లోకి వచ్చాకా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తున్నా.. ఫ్రీ స్కీమ్ కావడంతో ఆదాయం పెద్దగా లేదనేది వాస్తవం. ఇక బస్సులన్ని లేడీస్‌తో కిక్కిరిసి పోతున్నాయి. మగవారు ప్రయాణించడానికి స్థలం ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే కెపాసిటీకి మించిన లోడ్‌తో బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూర్చోవడానికి సీట్లు లేవని గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో చోటుచేసుకుంది.
సీట్లకోసం జరిగిన గొడవలో మహిళలు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. వీడియోలో చూసినట్లయితే బస్సు ఆగి ఉంది. అందులో ప్రయాణికులు కూడా ఉన్నారు. బయట చాలా మంది గుమిగూడి ఉన్నారు. మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అక్కడ ఉన్న వారు వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది చోద్యం చూస్తూ నిల్చున్నారు. ఇదంతా ఉచిత బస్సు స్కీమ్ మూలంగానే అని క్లియర్‌గా అర్థం అవుతుంది. ప్రభుత్వాలు ప్రజల అవసరాల రిత్యా ఇలాంటి ఉచిత పథకాలు తీసుకొస్తే, జనాలు మాత్రం వాటిని నీరుగారుస్తారు. తెలంగాణలో కూడా ఇదే తరహా స్కీమ్ అమల్లో ఉంది. కనీసం ఫుడ్ బోర్డ్ చేయడానికి కూడా మగవారికి స్థలం ఉండట్లేదని వాపోతున్నారు. ఇక బస్సులను పెంచాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పథకాలను ప్రయాణికులు సవ్యంగా ఉపయోగించుకోవాలని నెటిజన్లు కాామెంట్లు పెడుతున్నారు.