పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి ఎంపీల సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం 49 మంది ఎంపీలు లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసిన మోసపూరిత రుణ యాప్‌ల వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాలు, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, మాడ్యూల్ హెడ్‌తో సహా ఎనిమిది మంది ఐఎస్‌ఐఎస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిసెంబర్ 21న హాజరు కావాలని ఈడీ కోరింది.
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముడి పాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్జీ హైవేలోని తిరుపతి బాలాజీ ఆలయంలో దర్శనం కోసం ఉంచారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. ఆస్పత్రిలోని ఓపీడీలో మంటలు చెలరేగినట్లు సమాచారం.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభ నుంచి 33 మంది సభ్యులను సస్పెండ్ చేస్తు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటకలో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటనలో పెద్ద అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 10న రాష్ట్రంలోని బెలగావిలో ఓ మహిళను కొట్టి, బట్టలు విప్పి ఊరేగించారు.
నేడు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ స్పీకర్ మరో 33 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను ఏఎస్‌ఐ సోమవారం జిల్లా జడ్జి కోర్టులో సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి నివేదికను సీల్డ్ కవరులో దాఖలు చేశారు.
స్వర్వేద మహామందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా మారింది. వారణాసిలో ఉన్న ఈ మహా దేవాలయాన్ని ఏడు అంతస్తులతో నిర్మించారు. ఇందులో ఒకేసారి 20,000 మందికి పైగా కలిసి కూర్చుని ధ్యానం చేయవచ్చు. దీనిని ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు.
తగ్గిపోయాయని అనుకున్న కరోనా కేసులు మళ్లీ పడగవిప్పుతున్నాయి. తాజాగా కరోనా వల్ల ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కరోనాతో నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సామాన్ని నింపిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు.