»P Chidambaram Defeat In Three States This Is Alarming
P Chidambaram: మూడు రాష్ట్రాల్లో పరాజయం.. ఇది ఆందోళనకరమే!
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సామాన్ని నింపిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు.
P Chidambaram: బీజేపీ పార్టీ ప్రతి ఎన్నికను ఇదే తుది సమరంగా భావించి పోరాడతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సామాన్ని నింపిందని ఆయన అన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస పరాజయం ఏ మాత్రం ఊహించలేదని.. ఓడిపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. నాలుగు పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 శాతం ఓటింగ్ షేర్ నిలబెట్టుకుందని చిదంబరం తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి ఇది 45 శాతానికి పెరుగుతుందని అన్నారు.
ఎన్నికల చివరి వరకు ప్రచారం సాగించడం, బూత్ మేనేజ్మెంట్, ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడం వంటి అంశాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించాలని చిదంబరం తెలిపారు. ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే అంశంపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.