»Lic Which Is Giving Credit Cards These Are The Offers
LIC: క్రెడిట్ కార్డులు ఇస్తోన్న ఎల్ఐసీ..ఆఫర్లు ఇవే
ఎల్ఐసీ ఇప్పుడు అద్భుత ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డులకు ఎటువంటి జాయినింగ్ ఫీజు, అలాగే వార్షిక ఫీజు కూడా లేదని ఎల్ఐసీ తెలిపింది. ఈ కార్డులపై ప్రమాద బీమా కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మంచి ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. ఐడీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ, మాస్టర్ కార్డులు సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డులను అందిస్తూ వస్తున్నాయి. ఎల్ఐసీ క్లాసిక్, ఎల్ఐసీ సెలక్ట్ పేరుతో రెండు కార్డులను ఎల్ఐసీ ఈ మధ్యనే లాంచ్ చేసింది. ఈ రెండు కార్డులను డిసెంబర్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు అద్భుతమైన ప్రయోజనాలు లభించనున్నాయి.
ఎల్ఐసీ అందిస్తోన్న ఈ కార్డుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించినందుకు రివార్డ్ పాయింట్లను కూడా పొందే అవకాశం ఉంది. ఈ క్రెడిట్ కార్డులు వాడే యూజర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఇకపోతే వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సి అవసరం లేదు. ఇక వడ్డీ రేట్ల విషయంలో కూడా ఎల్ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. ఈ కార్డుపై వడ్డీ రేటు సంవత్సరానికి 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డు తీసుకున్న యూజర్లు ఎలాంటి జాయినింగ్ ఫీజు కానీ, వార్షిక ఫీజు కానీ చెల్లించాల్సి అవసరం లేదని తెలిపింది. నెలకు 0.75 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రేట్లుగా ఎల్ఐసీ నిర్ణయించింది. క్యాష్ విత్‌డ్రాయల్ విషయానికొస్తే 48 రోజుల వరకు అన్ని ఏటీఎమ్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డు విషయానికొస్తే ఈ కార్డులో కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు ఏం లేవని తెలిపింది. క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు కూడా 48 రోజుల్లోపు లేవని చెప్పింది. ప్రమాద బీమా కూడా రూ.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపింది.