భారత పార్లమెంట్‌పై జరిగిన పొగ దాడికి నిరుద్యోగమే కారణం. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. నిరుద్యోగం కారణంగానే యువత పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారని అన్నారు.
బాలికపై లైంగికదాడి కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గోండ్‌కు కోర్టు 25 సంవత్సరాల జైల్ శిక్ష విధించింది. 2014లో ఈ కేసు నమోదు కాగా 9 సంవత్సరాల తరువాత కోర్టు దోషిగా తేల్చి.. శిక్ష ఖరారు చేసింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందని ముంబాయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాధ్ సాహు ఇంట్లో చేపట్టిన ఐటీ సోదాలు నిన్నటితో ముగిశాయి. పది రోజులు కొనసాగిన ఈ రైడ్‌లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. ఈ డబ్బుపై సాహు తొలిసారిగా స్పందించారు.
2023లో ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం బిర్యానీ. స్విగ్గిలో వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా అత్యధికంగా ఆర్డర్ చే'సిన ఆహార వస్తువుగా బిర్యానీ నిలిచింది.
గత పదేళ్ల కాలంలో 14 దేశాల నుంచి భారత ప్రధాని మోదీ అత్యున్న పురష్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా అత్యధిక పురష్కారాలను సాధించిన ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు.
పార్లమెంట్ హౌస్ లోపల, బయట రచ్చ సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న లలిత్ ఝాను కోర్టు 7 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఢిల్లీ పోలీసులు 15 రోజుల కస్టడీని కోర్టును కోరారు.
బీహార్‌లోని మధుబని జిల్లా జైనగర్‌లో శుక్రవారం ముంబైకి వెళ్తున్న పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత జైనగర్ స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.
తమిళనాడులోని చెన్నై నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
మహారాష్ట్రలోని మోహ్లా మన్‌పూర్ జిల్లా గడ్చిరోలి సరిహద్దులో మహారాష్ట్ర పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కమాండర్ స్థాయికి చెందిన ఇద్దరు నక్సలైట్లను హతమార్చడంలో పోలీసులు ఘన విజయం సాధించారు.
పార్లమెంట్ ఘటన కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పరిధి నిరంతరం పెరుగుతోంది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఇప్పుడు చాలావరకు సాంకేతిక, ఎలక్ట్రానిక్ ఆధారాలపై ఆధారపడి ఉంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ నేడు తన పుట్టినరోజు నాడే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోడీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సరిహద్దు ప్రాంతాల్లో బంగారం బిస్కెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి ఏకంగా కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా వైఫల్యం కారణంగా కొందరు దుండగులు పార్లమెంట్‌లోకి వెళ్లి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుల కుటుంబాలు స్పందిస్తూ.. ఈ కుట్ర వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పలు చోట్ల కొన్ని గోల్డ్ షాపుల యజమానులు నగదు ముందుగా కట్టడం ద్వారా తర్వాత బంగారు అభరణాలు తీసుకోవచ్చని ఆఫర్ల ఉన్నాయని కస్టమర్లకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ షాపు యజమాని ఆఫర్ ఉందని చెప్పి వినియోగదారుల నుంచి ఏకంగా రూ.100 కోట్లకుపైగా తీసుకుని చీట్ చేశాడు.