దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో మరోసారి హైదరాబాద్ నిలిచింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. భాగ్యనగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
శబరిమల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నా కూడా దర్శనం కాకపోయే సరికి పలువురు భక్తులు తిరుగుపయనమవుతున్నారు.
మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలోని ఆస్పత్రిలోకి చిరుతపులి ప్రవేశించడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందారు. షాహదా పట్టణంలోని డోంగర్‌గావ్ రోడ్డులో ఉన్న ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రిలోకి చిరుత చేరడంతో అక్కడకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆధార్ కార్డులను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ యూఐడీఏఐ ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden) వచ్చే ఏడాది భారత్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావడం లేదని తెలిసింది. పలు కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నేడు, రేపు గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ బీహార్ బిజినెస్ కనెక్ట్-2023 మరికాసేపట్లో మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాల నుంచి 600 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు.
భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 సినిమాలు, షో లిస్ట్‌ను గూగుల్ విడుదల చేసింది. మరి ఆ సినిమాలు, షో లిస్ట్‌లు ఏంటో తెలుసుకుందాం.
బాలికలకు రాత్రి 8 గంటల తర్వాత కోచింగ్ ఇవ్వకూడదని గతంలో యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చింది. విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ.. తాజాగా కొత్త ఉత్తర్వులను ప్రకటించింది.
కొడుకు మీద ఉన్న కక్షతో తల్లిపై కిరాతకంగా ప్రవర్తించిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. కొడుకు ప్రేమించాడని తల్లిని వివస్త్రను చేసి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కంట్రోల్ రూమ్‌లో సోమవారం రాత్రి వచ్చిన ఓ ఫోన్ కాల్ కలకలం సృష్టించింది.
సినీ, ప్రజా సమస్యలను తెలుపుతూ, వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా బహిరంగ లేఖ రాశారు.
తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. అమిత్ షాకు కౌంటర్ వేశారు.
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ప్రకటించారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పేరును ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల మాదిరిగానే రాజస్థాన్‌లో కూడా ముఖ్యమంత్రి పేరు ప్రకటనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల పేర్లను ప్రకటించారు.
డబ్బు కోసం ప్రశ్నలడిగిన కేసు నుంచి మహువా మొయిత్రాకు ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లు ఎదురవుతున్నాయి. మొదట ఆమె లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు.
మొన్నటి వరకూ ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. అయితే ఇప్పుడు ఉల్లి పోయి వెల్లుల్లి ఆ దారిలోకి వచ్చింది. ప్రస్తుతం వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.