ఇండియాలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లోనే 237 కొత్త కేసులు నమోదవ్వడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్ అయ్యింది.
పార్లమెంట్ హౌస్ వెలుపల, లోపల భద్రతా ఉల్లంఘనలకు పాల్పడిన నలుగురు నిందితులను 7 రోజుల రిమాండ్‌కు పంపారు. అయితే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మాత్రం 15 రోజుల రిమాండ్ కోరింది.
మహారాష్ట్రలో గత 10నెలల కాలంలో రెండు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ వెల్లడించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిని 80మంది అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం 9 మంది ఎంపీలు సహా మొత్తం 14 మంది కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఎంపీలందరినీ లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు.
లోక్ సభలోకి దూసుకెళ్లిన ఆగంతకుడు సాగర్ శర్మ అంతకుముందే సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. లోక్ సభలో ప్రవేశించి రచ్చ చేస్తామని ముందే అందులో పేర్కొన్నారు. మరో దుండగుడి తండ్రి స్పందించారు. తప్పు చేసినట్టు రుజువైతే ఉరి శిక్ష విధించాలని కోరారు.
శబరిమలలోని అయ్యప్ప దేవాలయం వద్ద భక్తుల రద్దీ అంశంపై పలువురు యాత్రికులు హైకోర్టును ఆశ్రయించారు. రద్దీ నియంత్రణకు నిర్వహణ లోపం సహా పలు అంశాలను ప్రస్తావించారు.
లోక్‌సభలో స్మోక్‌గ్యాస్ చల్లి భయాందోళనలు సృష్టించిన నిందితులను పట్టుకున్న ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ 2023 సంవత్సరానికి సంబంధించిన టాప్ ట్రెండ్‌లు, సెలబ్రిటీ సెర్చ్‌ల జాబితాను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మోహన్ యాదవ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ప్రభుత్వం మొదటి ఉత్తర్వును జారీ చేశారు.
మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ నేడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా ప్రమాణ స్వీకారం చేశారు.
ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవసాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు అరుణ్ సావో, విజయ్ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహదేవ్ గేమింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. రవి ఉప్పల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రవి ఉప్పల్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుపై వారం రోజులుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. ఎంపీ ఇంట్లో ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. ఇప్పుడు ఎంపీ ఇంటి నుంచి బంగారం, ఖరీదైన ఆభరణాల కోసం ఆదాయపు పన్ను శాఖ ఆరా తీస్తోంది.
భారత కొత్త పార్లమెంటు హౌస్లో ఎంపీలు చూస్తుండగానే లోక్‌సభ విజిటర్ గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు స్పీకర్ వెల్‌లోకి దూకారు. షాక్‌కు గురైన ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు.