»Sabarimala Pilgrims To High Court Overcrowding Of Sabarimala Kerala
Sabarimala rush:పై కోర్టుకు యాత్రికులు..ఆదేశాలు జారీ
శబరిమలలోని అయ్యప్ప దేవాలయం వద్ద భక్తుల రద్దీ అంశంపై పలువురు యాత్రికులు హైకోర్టును ఆశ్రయించారు. రద్దీ నియంత్రణకు నిర్వహణ లోపం సహా పలు అంశాలను ప్రస్తావించారు.
sabarimala Pilgrims to high court overcrowding of Sabarimala kerala
లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం, శబరిమల కొండ పుణ్యక్షేత్రంలో భారీ రద్దీని నిర్వహించడంలో వైఫల్యం చెందిందని ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి నేతలు విమర్శలు చేశారు. భక్తుల నిర్వహణపై పినరయి విజయన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భక్తులకు సహాయం చేయడానికి LDF ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. శబరిమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోకుండానే అయ్యప్ప భక్తులు వెనుదిరుగుతున్నారని విమర్శలు చేశారు. రవాణా సౌకర్యాల కొరత, వైద్య సదుపాయం లేకపోవడం, తాగునీరు, ఆహారం కొరత చాలా మంది భక్తులు ప్రస్తావించారని గుర్తు చేశారు.
ఈ క్రమంలో భక్తుల నిర్వహణను సమీక్షించడానికి మంత్రి కె రాధాకృష్ణన్‌ను నిన్న శబరిమలను సందర్శించారు. నిలక్కల్, ఎరుమేలి, పంపాలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. శబరిమల అంశంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి, రాబోయే ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో చాలా మంది చాలా విషయాలు చెబుతారని బదులిచ్చారు. భక్తులు తమను తాము నియంత్రించుకోవాలని, శబరిమల రద్దీ సహజమని దేవస్వామ్ మంత్రి తెలిపారు. సన్నిధానంలో మంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు. దేవస్వం బోర్డు అధ్యక్షుడు, సభ్యులు, ప్రత్యేక కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
డిసెంబర్ 7న శబరిమల వద్ద అత్యధిక సంఖ్యలో యాత్రికులు 1.02 లక్షలు నమోదయ్యారు. సగటు సుమారు 80,000. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది మహిళలు, పిల్లలు, వృద్ధ యాత్రికుల సంఖ్య 30% పెరిగింది. సహజంగానే అలాంటి వ్యక్తులు ‘పతినెట్టంపాడి’ (ఆలయానికి వెళ్ళే పవిత్రమైన 18 మెట్లు) సులభంగా ఎక్కలేరు. ఇది మొత్తం యాత్రికుల సంఖ్య పెరగడంతో పాటు తాము కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితికి దారితీసిందని మంత్రి అన్నారు.
ఆలయంలో దర్శన సమయాన్ని రోజుకు 17 నుండి 18 గంటలకు పెంచడంతోపాటు, వర్చువల్ క్యూ బుకింగ్‌లను రోజుకు 90,000 నుంచి 80,000 కు తగ్గించామన్నారు. దీంతోపాటు ఎరుమేలి, పంబా వద్ద భద్రతా చర్యలను పెంచామని ఆయన అన్నారు. నవంబర్ 17న ప్రారంభమైన మండలం సీజన్లో మొదటి 19 రోజులలో ప్రతిరోజూ దాదాపు 62,000 మంది యాత్రికులు శబరిమలను సందర్శించారు. డిసెంబర్ 6 నుంచి వారి సంఖ్య క్రమంగా పెరిగింది. దీంతో కొండ గుడి వద్ద భారీ రద్దీ ఏర్పడుతుంది.
ఇదే సమయంలో శబరిమల రద్దీకి సంబంధించి స్వచ్ఛందంగా దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. ప్రస్తుత పరిస్థితిపై భద్రతకు సంబంధించిన ఏడీజీపీ వివరణ ఇవ్వనున్నారు. నిలక్కల్ వద్ద ఎక్కువ పార్కింగ్ స్థలాన్ని కేటాయించడంపై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తన వైఖరిని కూడా వ్యక్తం చేయవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ 80,000కు చేరుకునే రోజుల్లో స్పాట్ బుకింగ్ 10,000గా నిర్ణయించాలని హైకోర్టు సూచించింది. క్యూ కాంప్లెక్స్‌లో, యాత్రికుల షెడ్డులో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ఉండకూడదని, స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది.