మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిని 80మంది అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Food Posion: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిని 80మంది అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల ఆరోగ్యం క్షీణించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. నాగ్‌పూర్ నగర శివార్లలోని ఒక రిసార్ట్‌లో వివాహ వేడుకలో అనుమానాస్పద విషపూరితమైన ఆహారం కారణంగా 80 మంది అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పెళ్లికొడుకు తండ్రి రిసార్ట్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయడంతో వేడుకలో నిల్వ ఉంచడంతో పాడైపోయిన అదే ఆహారాన్ని వడ్డించారని పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడు కైలాష్ బాత్రా తన కుమారుడి వివాహం, రిసెప్షన్ కోసం డిసెంబర్ 9,10 తేదీలలో రెండు రోజుల పాటు నాగ్‌పూర్‌లోని అమరావతి రోడ్‌లోని రాజస్థానీ గ్రామ నేపథ్య రిసార్ట్‌ను బుక్ చేసినట్లు కమలేశ్వర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. “డిసెంబర్ 10 మధ్యాహ్నం వరుడు, చాలా మంది అతిథులకు రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి సమస్య మొదలైంది” అని అధికారి తెలిపారు. అదే రాత్రి విందు సందర్భంగా వారికి అందించిన ఆహారం దుర్వాసన రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. అర్ధరాత్రి కనీసం 80 మంది అతిథులు వాంతులు అవుతున్నట్లు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. వారి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన వారి వాంగ్మూలాలను నమోదు చేసి వారి వైద్య నివేదికలను సేకరించాలని కల్మేశ్వర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించామని, దాని ఆధారంగా రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పొద్దార్ తెలిపారు.