ఈపాటికే హరీష్ శంకర్ రెండు మూడు సినిమాలు చేసి ఉండాల్సింది. చాలా కాలంగా పవన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఫైనల్‌గా పవన్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టాడు. షూటింగ్ మధ్యలో ఇప్పుడు రవితేజతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. మరి ఉస్తాద్ పరిస్థితేంటి?
‘Ustad Bhagat Singh: తనపై వచ్చే రూమర్లను హరీష్ శంకర్ తిప్పి కొట్టేవాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌ను (Ustad Bhagat Singh) పక్కకు పెట్టేసి.. రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని న్యూస్ వచ్చినప్పుడల్లా.. కౌంటర్ ఇచ్చాడు హరీష్ శంకర్. కానీ ఈసారి మాత్రం పుకార్లను నిజం చేశాడు హరీష్. ముచ్చటగా మూడోసారి మాస్ మహారాజాతో సినిమా అనౌన్స్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ఈసారి మాస్ రీ యూనియన్ ఇంకా స్పైసీగా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు తెలియజేస్తాం’ అని యూనిట్ పేర్కొంది.
షాక్ సినిమాతో హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసిన రవితేజ.. ఆ తర్వాత మిరపకాయ్తో మంచి హిట్ అందుకున్నాడు. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఈ క్రేజి కాంబో సెట్ అవడంతో.. అనౌన్స్మెంట్తోనే మంచి బజ్ క్రియేట్ అవుతోంది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) పరిస్థితేంటనేది అర్థం కాకుండా పోయింది. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ.. పవన్, హరీష్ శంకర్ కలిసి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustad Bhagat Singh) సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. కానీ ఇంతవరకు సగం పార్ట్ కూడా పూర్తి కాలేదు.
ప్రస్తుతం పవన్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అందుకే హరీష్ శంకర్ ఆ సినిమాను పక్కకు పెట్టి రవితేజతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడనే చెప్పాలి. మరి ఉస్తాద్‌ను పూర్తిగా పక్కకు పెట్టేశాడా? లేదంటే రవితేజ సినిమా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేస్తాడా? అనేది చూడాలి.