ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సోమవారం కదులుతున్న కారులో 22 ఏళ్ల ప్రభుత్వ అధికారి కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముగ్గురు నిందితులను 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళ సీఎం పినరయి విజయన్, అక్కడి గవర్నర్ మధ్య మాటల యుద్ధం కాస్తా గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. తాజాగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తనపై సీఎం దాడి చేయించారని ఆరోపణలు చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా చర్చనీయాంశంగా మారింది.
భూమి కొనుగోలు విషయంలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కేసు నమోదు చేసింది. ఈక్రమంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఆరోసారి ఈడీ నోటీసులు పంపింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇది రాజ్యంగానికి వ్యతిరేకమని పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్డు ఈరోజు తీర్పును వెలువరించింది.
రోజురోజుకి దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఉద్యోగాలు లేక చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. దేశంలో ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు ఇటీవల కేంద్రం ఓ నివేదికలో వెల్లడించింది.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు పేరు ఏ రేంజ్లో మార్మోగిపోతుందో వార్తల్లో వింటూనే ఉన్నాం. డిసెంబర్ 6న సాహుకు సంబంధించిన స్థలాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. మూడు రాష్ట్రాల్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఓ వ్యక్తి చిన్న కుక్కపిల్ల పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన చిన్న కుక్కపిల్లను నేలపై విసిరి క్రూరంగా చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర మంత్రితోపాటు సీఎం కూడా స్పందించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో షూటర్లు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే వారి అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసులు, రాజస్థాన్ పోలీసుల మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది.
కొందరు ఎలాంటి తప్పు చేయకుండా కొన్ని కేసుల్లో ఇరుక్కుంటారు. దీంతో జీవితం అయిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నం.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సీఎం ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. రాయ్‌పూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే బీజేపీ నేతలు ఎక్కువగా విష్ణు దేవ్ సాయి వైపే మొగ్గుచూపారు.
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భార్యకు ఇష్టంతో సంబంధం లేదని.. వైవాహిక అత్యాచారం నేరం కాదని తెలిపింది. భార్యకు 18 ఏళ్లు దాటితే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను అధికారికంగా నియమించారు. లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు వ్యూహాత్మక ఎత్తుగడను ఉద్ఘాటిస్తూ ఈ ప్రకటన చేశారు.
జైపూర్‌లో గల శ్యామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఓ మహిళ 47 ఏళ్ల వయసులో ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది. అంతేకాదు మరో ట్రాన్స్ జెండర్ వ్యక్తితో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఎందుకు అలా చేసింది? ఆ విశేషాలేంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు విద్యార్థినులతో ఉన్న నిండు సభలో అవమానం జరిగింది. అవును ఓ స్కీం గురించి విద్యార్థులను సీఎం ప్రశ్నించగా..తమకు రాలేదని విద్యార్థినులు ముక్తకంఠంతో చెప్పారు. దీంతో సీఎం హేమంత్ సోరెన్ షాకై ప్రసంగం ఆపి వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.