ప్రభుత్వ ఆస్పత్రిలో 9 మంది నవజాత శిశువులు మరణించారు. గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మరికొంత మంది శిశువుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఒక్కో మంచంపై ముగ్గురు శిశువులను ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
తమిళనాడులో భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
గుజరాత్‌లో జాతీయ రహదారిపై నకిలీ టోల్ ప్లాజా నడుపుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది నుంచి నకిలీ టోల్ ప్లాజా నడుపుతున్నట్లు సమాచారం.
విదేశాల్లో గత ఐదేళ్లలో భారతీయ విద్యార్థులు 403 మంది మరణించినట్లుగా విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. భారతీయ విద్యార్థులను సంరక్షించే బాధ్యత తమదేనని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని తెలిపారు.
ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (IPC) మెఫ్టల్ పెయిన్‌కిల్లర్ గురించి డ్రగ్ సేఫ్టీ హెచ్చరికను జారీ చేసింది. దానిలోని మెఫెనామిక్ యాసిడ్, ఇసినోఫిలియా, దైహిక లక్షణాల (DRESS)సిండ్రోమ్ వంటి ప్రతికూల చర్యలకు కారణమవుతుందని పేర్కొంది.
సహజీవనం సమాజాన్ని పీడిస్తున్న ఓ ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరవీర్ సింగ్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రేమ వివాహాల్లో ఎక్కువ విడాకులు అవుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
భువనేశ్వర్ నుంచి హోరా వెళ్తున్న జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
నవరాత్రుల పండగ సందర్భంగా గుజరాత్‌లో గర్బా నృత్యం చేయడం సంప్రదాయంగా వస్తోంది. తాజాగా ఈ గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు లభించింది.
భారీ వర్షాల వల్ల చెన్నైలో 12 మంది వరకూ మరణించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుంపర జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా అరేబియా సముద్రంలో మరో తుఫాను చెలరేగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
మిచౌంగ్ తుపాను(Michaung Cyclone) కారణంగా తమిళనాడులోని పలు నగరాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు చోట్ల పంటలు నష్టపోయాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గత రెండు దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగిస్తున్నారు. కానీ చాలా హుందాగా, క్షమించే సీఎంగా శివరాజ్ సింగ్ కు పేరుంది.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్‌సభలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిల్లు లక్ష్యాలపై అందరూ ఏకీభవిస్తున్నారని అన్నారు.
దక్షిణాదిన బీజేపీ ఎప్పటికిీ గెలవదని, కేవలం గోమూత్ర రాష్ట్రాల్లోనే గెలుస్తుందని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ అన్న మాటలకు బీజేపీ ధ్వజమెత్తింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఖండించింది. దీంతో బుధవారం పార్లమెంట్‌లో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.
ప్రపంచంలో శక్తిమంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టాప్ 100లో భారత్‌కు చెందిన నలుగురు భారతీయులు ఉన్నారు.
గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ మరణించారు. జైపూర్‌లో గల అతని నివాసంలో హత్య చేశారు.