ప్రకృతి వైపరీత్యాలతో తమిళనాడు (Tamilnadu) అల్లాడిపోతోంది. నిన్న మొన్నటి వరకూ మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) భారీ నష్టాలను కలిగించింది. వరదల వల్ల చెన్నై (Chennai) నగరంలో 12 మంది మరణించారు. తాజాగా నేడు తమిళనాడులో భూకంపం (Earthquake) సంభవించింది. చెంగల్పట్టులో శుక్రవారం ఉదయం 7.39 గంటలకు భూకంపం సంభవించినట్లుగా అధికారులు వెల్లడించారు.
— National Center for Seismology (@NCS_Earthquake) December 8, 2023
ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. తీవ్ర భయాందోళనకు గురవ్వడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం బులెటిన్‌ను కూడా విడుదల చేసింది.
చెంగల్పట్టు (Chengalpattu)కు పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) ట్విట్టర్ వేదికగా భూకంపానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని అధికారులు వెల్లడించారు.