»Michaung Cyclone Effect Schools Holiday On December 7th 2023 At Chennai And Ap
Michaung Cyclone: ఎఫెక్ట్..రేపు కూడా స్కూళ్లకు సెలవు
మిచౌంగ్ తుపాను(Michaung Cyclone) కారణంగా తమిళనాడులోని పలు నగరాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు చోట్ల పంటలు నష్టపోయాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Michaung Cyclone effect schools holiday on december 7th 2023 at chennai and ap
మిచౌంగ్ తుపాను(Michaung Cyclone) తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై దాని శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇళ్లలోకి నీరు చేరి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం కూడా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత జోన్లకు చేరారు. తమ పిల్లలను ఎత్తుకుని, నిలిచిపోయిన నీటిలో పలు ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్లడానికి మరిన్ని పడవలను పంపించాలని మరికొందరు సాయం కోసం అభ్యర్థించారు. అయితే సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు డిసెంబరు 7న చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు మరో రోజు సెలవు ప్రకటించారు.
ఈ క్రమంలో గ్రేటర్ చెన్నై పోలీసులు (GCP), జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (DDRT)తో కలిసి 6,560 మంది వరద బాధిత ప్రజలను రక్షించారు. ప్రజలకు ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులను అందించారు. పోలీసులు ఇప్పటివరకు అవసరమైన వారి కోసం 21,967 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 40 ఏళ్ల తర్వాత మైచాంగ్ తుపాను కారణంగా చెన్నై(chennai)కి ఇంత భారీ నష్టం వాటిల్లిందని అక్కడి నేతలు అంటున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తమిళ ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ, నిధులు అందించాలని నేతలు కోరారు. తమిళనాడు ప్రభుత్వంపై మాకు అసంతృప్తి ఉందని.. తమిళనాడు ప్రజలను కాపాడేందుకు కేంద్రం మెరుగైన ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh) NTR జిల్లాలో కూడా మిచౌంగ్ తుపాను ప్రభావం కనిపించింది. దీంతో ఈ జిల్లాలో భారీగా కురిసిన వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. మరోవైపు అల్లూరి జిల్లాలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. అరకులోయ-విశాఖ ఘాట్ రోడ్డులో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలోనే అనంతగిరి మండలం లువ్వా వాగు దాటుతున్న క్రమంలో ఓ మహిళ సహా ముగ్గురు గల్లంతయ్యారు. వారి రాక కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో కూడా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.