Toll Plaza: జాతీయ రహదారిపై అనధికారంగా టోల్ ప్లాజా నడుపుతున్న ఘటన గుజరాత్లో వెలుగులోకి వచ్చింది. సుమారు ఏడాది నుంచి నిర్వహిస్తున్న నకిలీ టోల్ ప్లాజా ద్వారా నిందితులు రూ.75 కోట్లకు పైగా వసూలు చేశారు. మోర్బి జిల్లాలో బమన్బోర్, కచ్ హైవేపై మోర్బి-వాంకనర్ గ్రామాల మధ్య వఘాసియా టోల్ ప్లాజా ఉంది. ఈ టోల్ ప్లాజా తగలకుండా నిందితులు అక్కడ ఉన్న సిరమిక్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డును మళ్లించి కొత్త రోడ్డు వేశారు. ఈమధ్యలో నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
ఈ టోల్ పక్కనే ఒక టైల్స్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ మూతపడి ఉంది. దీంతో ఆ ఫ్యాక్టరీ యజమానితో పాటు అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లు వాహనాల నుంచి డబ్బులు తీసుకుని బైపాస్ ద్వరా బయటకు పంపించేవారు. తాత్కాలికంగా టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి వాహనాలను బలవంతం చేసి డబ్బులు తీసుకునేవారట. అలాగే ప్రభుత్వ టోల్ కంటే తక్కువ వసూలు చేసేవారు.