»Qin Gong Former Chinese Foreign Minister Murder Or Suicide
Qin Gong: చైనా మాజీ విదేశాంగ మంత్రి హత్యా లేక ఆత్మహత్యా?
చైనా రాయబారిగా పనిచేసి తర్వాత విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్విన్ గాంగ్ గత కొన్ని నెలలుగా కనిపించడం లేదు. అతని చనిపోయి ఉంటారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి.
Qin Gong: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ కొన్ని రోజులుగా కనిపించడంలేదు. ఆయన చనిపోయి ఉంటారని పలు అంతర్జాతీయ వార్తలు వెల్లడిస్తున్నాయి. అతను ఆత్మహత్య అయినా చేసుకుని ఉంటారు, లేదా ఎవరైనా హింసించి చంపి ఉంటారని తెలిపింది. ఈ ఏడాది జులై నుంచి క్విన్ గాంగ్ కనిపించడం లేదు. అప్పటి నుంచి అతను ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారని అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అయితే దేశంలోని టాప్ లీడర్స్ అందరూ బీజింగ్‌లోని మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆయన కూడా ఆ హాస్పిటల్లోనే జులైలోనే చనిపోయినట్టు ఇద్దరు ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం.
గతంలో అమెరికాకి దౌత్యవేత్తగా ఉన్న సమయంలో క్విన్ గాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారట. దీనిపై కూడా విచారణ జరుగుతోంది. ఆయన అంబాసిడర్ పదవిలో ఉన్నంత కాలం వివాహేతర సంబంధం కొనసాగించారని తెలిపింది. ఈయనకు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. క్విన్ గాంగ్ చివరిసారి జూన్ 25న కనిపించారు. క్విన్‌ను ముందుగా ఏషియన్ సమ్మిట్ హెడ్‌గా నియమించినా తర్వాత తొలగించారు. అనారోగ్యం కారణం వల్ల ఆయన తప్పుకున్నారని చైనా ప్రభుత్వం తెలిపింది. అలాగే యురోపియన్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరగాలి. కానీ వాటిని కూడా చైనా కారణం లేకుండానే పోస్ట్‌పోన్ చేసింది. ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తెర తీశాయి. సాధారణంగా చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఏ లీడర్ అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే వెంటనే ఆ పదవి నుంచి తొలగిస్తుంది. క్విన్‌ను తొలగించి ఆయన స్థానంలో వాంగ్ యీకి అవకాశమిచ్చింది.