»Live In Relationship A Dangerous Disease Said Bjp Mp Dharam Veer Singh In The Lok Sabha
BJP MP: సహజీవనం ప్రమాదకరమైన జబ్బు
సహజీవనం సమాజాన్ని పీడిస్తున్న ఓ ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరవీర్ సింగ్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రేమ వివాహాల్లో ఎక్కువ విడాకులు అవుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Live-in relationship A dangerous disease," said BJP MP Dharam Veer Singh in the Lok Sabha
BJP MP: సహజీవనం (Live-in relationship) అనేది ఓ ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్ అన్నారు. అది సమాజానికి ప్రమాదకరమని, దీనికి వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు. హరియాణాకు చెందిన ఎంపీ ధరంవీర్ సింగ్ లోక్సభ (Lok Sabha) జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రేమ పెళ్లిలలో విడాకుల శాతం అధికంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ అంశంపై పార్లమెంట్ (Parliament winter Session) దృష్టి పెట్టాలన్నారు.
‘వసుధైవ కుటుంబకమ్’ అనే తత్వానికి మన సంస్కృతి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం కూడా భిన్నమైనదని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఇది సాధారణమే అయినప్పటికీ.. మనదేశంలో అలా కాకూడదన్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో.. ఈ తరహా బంధాలు పెరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్-అఫ్తాబ్ పూనావాల కేసును ఉదహరించారు. సమాజంలో ఇప్పటికీ సంప్రదాయ వివాహాలకే అధిక ప్రాధాన్యం ఉందని ధరంవీర్ అభిప్రాయపడ్డారు.