జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు విద్యార్థినులతో ఉన్న నిండు సభలో అవమానం జరిగింది. అవును ఓ స్కీం గురించి విద్యార్థులను సీఎం ప్రశ్నించగా..తమకు రాలేదని విద్యార్థినులు ముక్తకంఠంతో చెప్పారు. దీంతో సీఎం హేమంత్ సోరెన్ షాకై ప్రసంగం ఆపి వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
jharkhand cm hemant soren insulted with students savitribai scheme
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ప్రతిపక్షాలతో సహా చాలా మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఆ స్కీం తమకు వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ‘ఆప్కీ యోజన-ఆప్కీ సర్కార్-ఆప్కీ ద్వార్’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సోరెన్ శనివారం మధ్యాహ్నం 1 గంటలకు ఖిజురియాలోని చండీహ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.200 కోట్ల విలువైన వంతెన, రోడ్డు తదితర పథకాలకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. సావిత్రి బాయి పూలే యోజన స్కీం ద్వారా సైకిళ్ల కోసం మొత్తం రూ.14 కోట్లను 500 మంది విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేసే కార్యక్రమం జరిగింది.
सुनने में आ रहा है कि हेमंत ने अपने जगहंसाई वाला ये वीडियो सरकारी प्लेटफॉर्म से हटा दिया है l हेमंत जी, आपने वीडियो तो हटा दिया लेकिन…
– झारखंड के दामन पर भ्रष्टाचार की जो कालिख आपने पोती है, उसे कैसे मिटाएंगे?
– अलमारी से जो नोटों का जखीरा मिला है, उसका हिसाब कब देंगे?
ఆ క్రమంలో విద్యార్థులతో నిండిన సభలో హేమంత్ సోరెన్ ప్రసంగించడం వీడియోలో చూడవచ్చు. ఇంతలో, అతను ఇలా అన్నాడు. మా అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, మీ సైకిల్‌కి డబ్బు వచ్చిందో లేదో మీరు నాకు చెప్పాలని కోరారు. దీంతో అక్కడున్న విద్యార్థినులు రాలేదని చేతులు ఊపారు. ఆ క్రమంలోనే సీఎం పక్కనున్న అధికారిని ఆ వివరాల గురించి ఆరా తీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.