»Mp Dheeraj Prasad Sahu It Raids Ended At Mps House
MP Dheeraj Prasad Sahu: ఎంపీ ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాధ్ సాహు ఇంట్లో చేపట్టిన ఐటీ సోదాలు నిన్నటితో ముగిశాయి. పది రోజులు కొనసాగిన ఈ రైడ్‌లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. ఈ డబ్బుపై సాహు తొలిసారిగా స్పందించారు.
MP Dheeraj Prasad Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాధ్ సాహు ఇంట్లో ఐటీ శాఖ చేపట్టిన సోదాలు ముగిశాయి. దాదాపు పదిరోజులుగా కొనసాగిన ఈ తనిఖీల్లో రూ.353 కోట్ల నగదు అధికారులు పట్టుకున్నారు. ఒకే దాడిలో ఇంత పెద్ద మొత్తం దొరకడం దేశంలో ఇదే మొదటిసారి. సాహుకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తన సంస్థల్లో ఐటీ రైడ్స్ జరిగాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా తనిఖీలు చేపట్టి మూడు కిలోల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సాహు కాంగ్రెస్ ఎంపీ కావడంతో బీజేపీ, ఇతర పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై ఎంపీ ధీరజ్ సాహు ఈ డబ్బుపై స్పందించాలని ఇతర పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
తొలిసారిగా సాహు స్పందిస్తూ.. ఆ డబ్బు తనది కాదని.. తన కంపెనీలకు చెందినదని వివరణ ఇచ్చారు. ఆ డబ్బుతో కాంగ్రెస్‌కు ఇతర రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉంటా.. మా కుటుంబ సభ్యులు వ్యాపారాలను చూసుకుంటారని తెలిపారు. పెద్ద ఉమ్మడి కుటుంబం కావడంతో మా సోదరుల పిల్లల వ్యాపారాలు చూసుకుంటున్నారని ఆయన అన్నారు. 35 ఏళ్లు నుంచి రాజకీయాల్లో ఉంటున్నా.. ఈ ఆరోపణలు నన్ను చాలా బాధించాయని ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బు మా కంపెనీలదని నేను గట్టిగా చెబుతున్నాను. 100 ఏళ్లుగా మా కుటుంబం మద్యం వ్యాపారంలో ఉందని సాహు తెలిపారు.