Mahesh Fans: మహేష్ ఫ్యాన్స్‌కి మండుతోంది.. తేడా కొడితే ఉంటది రాజా?
ఉండొచ్చు కానీ.. మరి ఇంత ఉండకూడదు అనేది మహేష్ ఫ్యాన్స్ మాట. ఇదే మాటను మళ్లీ మళ్లీ తిప్పి కొడుతున్నాడు యంగ్ ప్రొడ్యూసర్. దీంతో గుంటూరు కారం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు బాగానే ఉంటది.. సినిమా తేడా కొడితేనే అసలు కథ ఉంటుందని అంటున్నారు అభిమానులు.
మరో నెల రోజుల్లో గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. దమ్ మసాలా బిర్యానీ సాంగ్ తర్వాత.. రీసెంట్గా ‘ఓ మై బేబీ’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీల పై డిజైన్ చేసిన ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. అయితే ఈ సాంగ్ బాగలేదంటూ.. రిలీజ్ అవగానే సోషల్ మీడియాలో దారుణంగా నెగెటివ్ ట్రెండ్ చేశారు మహేష్ ఫ్యాన్స్. దీనిపై లిరిక్ రైటర్ రామ జోగయ్య కాస్త సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఇంకాస్త గట్టిగా రియాక్డ్ అయ్యాడు.
యానిమల్ సినిమాలోని ఎండ్ సీన్‌ని పోస్ట్ చేసి.. ట్రోలింగ్ చేసే వారిని సైలెంట్‌గా ఉండమని చెప్పాడు. మేము ఏమీ చేస్తున్నామో మాకు తెలుసు, జనవరి 12న కలుస్తాం అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు. దీంతో మళ్ళీ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగవంశీ. నేను జస్ట్ ఇలాంటి ఒక్క రిప్లై ఇచ్చినందుకే అంతలా బాధపడుతున్నారు. మరి రోజు సోషల్ మీడియాలో మా చిత్ర యూనిట్ సబ్యులని టార్గెట్ చేసి తిడుతున్నపుడు మాకెంత బాధగా ఉంటుంది? ఫీడ్ బ్యాక్ అనేది ఎలాంటి వ్యక్తిగత దూషణలు లాంటివి లేనంతవరకే.. తీసుకుంటామని కానీ మీరు ఇలా చేస్తే కాదు.. అని రాసుకొచ్చాడు.
సరే.. నాగవంశీ థియరీ బాగానే ఉంది కానీ, ఒకవేళ సినిమా తేడా కొడితే ఏంటి పరిస్థితి? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. నాగవంశీ తీరు కాస్త ఓవర్ కాన్ఫిడెన్సగా కనిపిస్తోంది. ఒకవేళ సినిమా సరిగ్గా లేకపోతే.. ఇదే ట్వీట్‌ను బయటికి తీసి చుక్కలు చూపించడం పక్కా. ఈ విషయం నాగవంశీకి అర్థం కావడం లేదు. సాంగ్‌కే ఇలా ఉంటే.. సినిమాకు వదిలిపెడతారా ఏంటి?