Deepika Padukone: శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ..వీడియో వైరల్
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని నేటి ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమ ఆమె నిన్న సాయంత్రమే తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు ఆమె నడుచుకుంటూ తిరుమలకు చేరారు. బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఆమె వెంట వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న దీపికా వీడియో:
Bollywood actress Deepika Padukone offers prayers at Lord Sri Venkateswara Swamy temple in Tirumala today, along with her sister and parents. She reached the Tirumala Hill shrine along the Alipiri trekking route, with her sister Anisha Padukone, last night.@hwnewsnetworkpic.twitter.com/28nqboo9Fl
గోవింద నామస్మరణ చేస్తూ ఆమె అలిపిరి మార్గంలో తన నడకను కొనసాగించారు. తిరుమల నడక మార్గంలో దీపికను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. తిరుమలకు చేరుకున్న దీపికాకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. గురువారం రాత్రి రాధేయ అతిధి గృహంలో బసచేసిన దీపికా శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న దీపికా వీడియో:
Actor Deepika Padukone arrived at Tirumala this evening, to offer prayers to Lord Venkateswara. pic.twitter.com/Wuf1g5P7Gz