»National Awards Of 14 Countries In Ten Years Pm Modi Has Achieved Another Record
PM Modi: పదేళ్లలో 14 దేశాల జాతీయ అవార్డులు..మరో రికార్డు సాధించిన ప్రధాని మోదీ
గత పదేళ్ల కాలంలో 14 దేశాల నుంచి భారత ప్రధాని మోదీ అత్యున్న పురష్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా అత్యధిక పురష్కారాలను సాధించిన ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరో అద్భుత రికార్డును సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోదీ విజయం సాధించాలని బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి ఎంతగానో ఎదురుచూస్తోంది. ప్రధానిగా మోదీ పాలన సాగించిన ఈ 10 ఏళ్ల కాలంలో భారత్ లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆయన ఎన్నో పురష్కారాలను అందుకున్నారు. కొన్ని దేశాలు తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాలను కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించడం విశేషం.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్‌తో సహా వివిధ స్థాయిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి గుర్తింపుగా పలు దేశాలు అవార్డులను అందించాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డులను ఆయన అందుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న అవార్డులు ఇవే:
2016లో ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు
2018 ఫిబ్రవరి నెలలో పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ పాలస్తీనా
2018 అక్టోబర్ నెలలో ఐక్యరాజ్యసమితి నుంచి యూఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు
2019 ఏప్రిల్ నెలలో యూఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయెద్
2019 ఏప్రిల్ నెలలో రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ
2019 జూన్ నెలలో మాల్దీవులు నుంచి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్
2019 ఆగస్ట్ నెలలో బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్
2020 డిసెంబర్ నెలలో సంయుక్త రాష్ట్రాలు నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్
2021 డిసెంబర్ నెలలో భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్
2023 మే నెలలో ఫిజీ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫిజీ
2023 మే నెలలో పాపువా న్యూ గినియా నుంచి ఆర్డర్ ఆఫ్ లోగోహు
2023 జూన్ నెలలో ఈజిఫ్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైలు
2023 జూలై నెలలో ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్
2023 ఆగస్ట్ నెలలో గ్రీస్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్