»Up Court Sentences Bjp Mla Ramdulare Gond To 25 Years Imprisonment In Sexual Assault Case
Ramdulare Gond: బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలుశిక్ష
బాలికపై లైంగికదాడి కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గోండ్‌కు కోర్టు 25 సంవత్సరాల జైల్ శిక్ష విధించింది. 2014లో ఈ కేసు నమోదు కాగా 9 సంవత్సరాల తరువాత కోర్టు దోషిగా తేల్చి.. శిక్ష ఖరారు చేసింది.
UP court sentences BJP MLA Ramdulare Gond to 25 years imprisonment in sexual assault case
Ramdulare Gond: బాలికపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్(UP) బీజేపీ(BJP) ఎమ్మెల్యేకు కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఘటన జరిగిన 9 సంవత్సరాల తర్వాత దోషిగా తేల్చి.. జైలు శిక్షతో పాటు, రూ. 10 లక్షల జరిమానా విధించింది. దీంతో అతని అసెంబ్లీ సభ్యత్వం కూడా కోల్పోనున్నారు. సోన్‌భద్ర జిల్లా, దుద్ధి నియోజకవర్గ గిరిజన ఎమ్మెల్యే రాందులార్ గోండ్( Ramdulare Gond) 2014లో ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు మయోర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఎమ్మెల్యేతో ఆ బాలిక కుటుంబం ఫైట్ చేస్తూనే ఉంది. గత సంవత్సరం ఈ కేసు సోన్‌భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యేల కోర్టుకు బదిలీ అయింది. కోర్టు అతడిని దోషిగా తేల్చింది. లైంగికనేరానికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు, పది లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేకు శిక్ష పడడంతో బాధిత కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.