గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌లో సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షకు గురయ్యారు. ఈక్రమంలో విపక్ష ఎంపీలు ఖర్గే నేతృత్వంలో భారీ నిరసన చేపట్టారు.
ఇప్పుడు X గతంలో Twitter సేవలు ఈరోజు(డిసెంబర్ 21న) మొరాయించాయి. దీంతో యూజర్ల టైమ్‌లైన్‌లో ట్వీట్లు కనిపించడం లేదు. ఖాళీగా చూపిస్తుంది. దీంతో అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనికి ప్రధాని, మంత్రులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో విద్యార్థులను శాంతా క్లాజ్‌గా రావడానికి వారి తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు తల్లిదండ్రుల అనుమతి లేకుండా శాంతాక్లాజ్ వేషం వేసి కార్యక్రమంలో పాల్గొనమని బలవంతం చేస్తే అలాంటి స్కూళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దేశంలో 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సాధారణ జలుబుకు ఉపయోగించే రెండు ఫ్లూ సిరప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వాటిపై హెచ్చరిక లేబుల్స్ కూడా ప్రచురించాలని తెలిపింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్తగా కేసులు నమోదు కావడం, కొవిడ్‌తో చనిపోవడంతో అందరిలో టెన్షన్ మొదలయ్యింది. ఇలాంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
2023కి గాను అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. మొత్తం 26 మందికి అర్జున అవార్డులు వరించగా.. అయిదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు వరించాయి.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 108 అడుగుల అగరబత్తీని తయారు చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
గతంలో వచ్చిన కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్‌తో యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో సినీ పరిశ్రమ వణికిపోతోంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పోచంపల్లిలో పర్యటించనున్నారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి.. వివిధ అవార్డు గ్రహీతలు, చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు.
హనుమాన్ చాలీసా కేసులో రానా దంపతుల పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. రానా దంపతులు ఏప్రిల్ 2022లో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించాలని పట్టుబట్టారు.
ఢిల్లీలో మూడు గంటలకు పైగా ఇండియా కూటమి నేతలు పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిపై కూడా ప్రధానంగా చర్చలు జరిపి తమ ప్రతిపాదనలను తెలియజేశారు.
కేరళలోని శబరిమలలో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో ఐదు కంపార్టుమెంట్లు కిక్కిరిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి చూస్తున్నారు.
మిచాంగ్ సైక్లోన్ తర్వాత ఇప్పుడు భారీ వర్షాల కారణంగా తమిళనాడులో జనజీవనం దుర్భరంగా మారింది. దక్షిణ తమిళనాడులో వరదల పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా తూత్తుకుడి, తిరుచెందూరు సమీపంలోని శ్రీవైకుంటంలో దాదాపు 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.