ఇప్పుడు X గతంలో Twitter సేవలు ఈరోజు(డిసెంబర్ 21న) మొరాయించాయి. దీంతో యూజర్ల టైమ్‌లైన్‌లో ట్వీట్లు కనిపించడం లేదు. ఖాళీగా చూపిస్తుంది. దీంతో అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్స్(ట్విట్టర్) సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. ఉదయం వినియోగదారుల టైమ్‌లైన్‌లో ట్వీట్లు ఆకస్మాత్తుగా చూపించడం నిలిపివేసింది. ఇవి వెబ్సైట్, యాప్‌లలో కూడా అలాగే చూపించాయి. ఆ క్రమంలో వారి X ఖాతాలు యాక్సెస్ చేయగలిగినప్పటికీ, వారి టైమ్లైన్లు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రొ వర్షన్లు కూడా పనిచేయడం లేదని అంటున్నారు. ఆ నేపథ్యంలో వినియోగదారులకు ట్వీట్లు కనిపించడం లేదు. దీంతో అనేక మంది X వినియోగదారులు ఈ అంశంపై ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందని తెలుస్తోంది. భారతీయ వినియోగదారులతోపాటు అనేక చోట్ల ఈ సమస్య తలెత్తినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక మంది #TwitterDown ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్స్ సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి ఈ సమస్య ఎంత సమయం ఉంటుంది? ఎలా పరిష్కరిస్తారనే వరకు వేచి చూడాల్సిందే.