Ayodhya Ram Mandir: అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 108 అడుగుల అగరబత్తీ తయారు చేస్తున్నారు. గుజరాత్లోని వడోదరకు చెందిన విహాభాయ్ భర్వాద్ అనే రైతు రామ భక్తుడు. రాముడుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈక్రమంలో ఐదున్నర లక్షల రూపాయిలతో అగరబత్తీ తయారు చేస్తున్నారు. 3428 కిలోలు ఉండే ఈ అగరబత్తీని 110 అడుగుల పొడవైన ట్రక్కులో ఉంచారు.
జనవరి 1న రోడ్డు మార్గంలో ఈ అగరబత్తీని అయోధ్యకు తీసుకువెళ్తారు. జనవరి 16న అయోధ్యకు చేరుకుంటుంది. ఈ అగరబత్తీలో 1475 కిలోల ఆవు పేడ, 191 కిలోల ఆవు నెయ్యి, 280 కిలోల చెక్క ముక్కలు, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 280 కిలోల బార్లీ, 376 కిలోల కుప్పల్ పౌడర్, 450 కిలోల హవాన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ అగరబత్తీ తయారు చేయడానికి రూ.5 లక్షలు ఖర్చ కాగా.. దీనిని అయోధ్యకు తీసుకువెళ్లడానికి దాదాపు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని పశుసంవర్థక శాఖ తెలిపింది.
ఈ అగరబత్తీని బహిరంగ ప్రదేశంలో ఎండ, వేడి ఉన్న సమయంలో తయారు చేస్తున్నారు. వర్షాలు కారణంతో కొన్ని రోజులు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. 108 అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పుతో పూర్తిస్థాయి ధూపదీపాన్ని డిసెంబర్ చివరిలో సిద్ధం అవుతుందని తెలిపారు. అయోధ్యకు బయలు దేరే అగరబత్తీ ఊరేగింపును పచ్చజెండా ఊపి మొదలు పెట్టనున్నారు. వడోదర నుండి అయోధ్యకు దూరం దాదాపు 1,800 కి.మీ. ఒక్కసారి వెలిగిస్తే 45 రోజుల వరకు నిరంతరం సువాసనలు వెదజల్లుతుందట.