Rent a Wife: సాధారణంగా కొన్ని వస్తువులను అద్దెకు ఇస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో భార్యలను అద్దెకి ఇస్తారు. మీరు విన్నది నిజమేనండి.. మధ్యప్రదేశ్‌లోని శివపురి అనే గ్రామంలో భార్యలను అద్దెకి ఇస్తారు. కేవలం భార్యలను మాత్రమే కాకుండా ఆడపిల్లలను కూడా అద్దెకి ఇస్తారు. రూ.10ల నుంచి వందలు, వేలు, లక్షల వరకు అద్దెకు ఇస్తారు. దీనికోసం ఒక సంత నిర్వహించి.. వాళ్లను అద్దెకి ఇస్తారు. భార్యను రెంట్‌కి ఇచ్చే భర్త.. కాంట్రాక్ట్‌తో ఆ వ్యక్తితో పంపుతాడు. దీనికోసం స్టాంప్ పేపర్స్‌తో ఒక బాండ్ కూడా రాసుకుంటారు.
తాత్కాలికంగా అతను భార్యను కొనుగోలు చేస్తాడు. ఆమె అతనికి మానసికంగా, శారీరకంగా భార్యగా ఉండాలి. ఈ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత భార్యను మళ్లీ వేరే వాళ్లు అద్దెకి తీసుకుంటారు. లేదా గడువు పూర్తయిన తర్వాత కూడా ఆమెతోనే ఉండాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాలి. దీనికి డబ్బు చెల్లించి రెన్యువల్ చేసుకుంటారు. కొంతమంది కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకు ఇస్తారు. భార్యలను మాత్రమే కాకుండా.. మైనర్ అమ్మాయిలు, పెళ్లయిన, పెళ్లికాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు అద్దెకి ఇస్తారు.
ఇక్కడ మైనర్, పెళ్లికాని అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎంత తక్కువ వయస్సు ఉంటే అంత ఎక్కువ డబ్బు ఇచ్చి అద్దెకు తీసుకుంటారు. కొంతమంది లక్షలు పెట్టి కూడా అమ్మాయిలను అద్దెకు తీసుకువెళ్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా గిరిజన తెగలు పాటిస్తున్నారు. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకు వధువులు దొరకపోవడం వంటి కారణాల వల్ల కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది మధ్యప్రదేశ్‌లోనే కాకుండా గుజరాత్లో కూడా ఉంది. కొంతమంది మహిళలు ఇది తమ ఆచారమని అంటున్నారు.