»Gujarat Fatal Road Accident 10 People Died After The Car Went Out Of Control
Gujarath: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి 10మంది మృతి
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొనడంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
Gujarat: Fatal road accident.. 10 people died after the car went out of control
Gujarath: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొనడంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. నదియాడ్లోని అహ్మదాబాద్, వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈకారులో 10 మంది ఉన్నారు. ఎనిమిది మంది స్పాట్లోనే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.