»School Children Should Come Dressed As Santa Claus 2023
School children: శాంతాక్లాజ్ వేషంలో రావాలన్న యాజమాన్యం..అధికారుల చర్యలు
మధ్యప్రదేశ్‌లో విద్యార్థులను శాంతా క్లాజ్‌గా రావడానికి వారి తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు తల్లిదండ్రుల అనుమతి లేకుండా శాంతాక్లాజ్ వేషం వేసి కార్యక్రమంలో పాల్గొనమని బలవంతం చేస్తే అలాంటి స్కూళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
School children should come dressed as Santa Claus 2023
మధ్యప్రదేశ్ షాజాపూర్‌లోని విద్యాశాఖ జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు క్రిస్మస్ సందర్భంగా తమ పిల్లలు శాంతాక్లాజ్ వేషంలో రావాలని చెప్పారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు శాంతాక్లాజ్ వలె పిల్లలు(School children) వచ్చే విషయంలో ముందుగా వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి పొందాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి నిర్ణయాలు వారి మత విశ్వాసాలను ప్రభావితం చేసి ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 14న జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లా విద్యాశాఖాధికారి వివేక్ దూబే ఈ మేరకు వెల్లడించారు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా శాంతాక్లాజ్ వేషం వేసి కార్యక్రమంలో పాల్గొనమని పిల్లలను బలవంతం చేయరాదని అన్నారు. ఆ క్రమంలో ఎవరైనా అలా పిల్లలపై బలవంతం చేస్తే ఆయా పాఠశాలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు.
#WATCH | Madhya Pradesh | District Education Officer in Shajapur issues order for schools, ahead of Christmas.
District Education Officer Vivek Dubey says, “Cultural programs are held in schools but the programs are a little religious and children of other faiths are also… pic.twitter.com/kXKeRVGv6E
సాధారణంగా అనేక పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని దూబే పేర్కొన్నారు. అయితే ఆ కార్యక్రమాలు మతపరమైనవి అయినప్పుడు కొంత మందికి నచ్చడం, మరికొంత మందికి నచ్చకపోవడం ఉంటుందన్నారు. అయితే ఇతర మతాలకు చెందిన పిల్లలు వారి పేరెంట్స్ ఇష్టం లేకుండా మతపరమైన పాత్రలను పోషించాలని బలవంతం చేయోద్దని కోరారు. చాలా సార్లు ఇలాంటి కార్యక్రమాలు సామరస్యపూర్వకంగా జరుగుతాయి. కానీ కొన్నిసార్లు వివాదాలకు కూడా దారి తీస్తాయని ముందుగానే హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు జరగకుండా చూసుకోవడానికి, అన్ని సంస్థలు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కానీ ఇతర మతాల పిల్లలను డ్రెస్ కోడ్ విషయంలో బలవంతం చేయకూడదని సూచించారు. ఇది అత్యవసరమైతే వారు సంరక్షకుల వ్రాతపూర్వక అనుమతితో మాత్రమే చేయాలని స్పష్టం చేశారు.