»Revanth Reddy Said Is Doing Kcr Politics Even With School Going Children
Revanth Reddy: బడికెళ్లే పిల్లలతో కూడా కేసీఆర్ రాజకీయం చేస్తుండు
తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం బడిపిల్లలతో కూడా రాజకీయం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అనేక స్కూళ్లలో కనీస సౌకర్యాల లేమి, కార్మికులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతుండగా.. అల్పాహార పథకం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
Emblem Of The State Should Bear The Symbols Of The Sacrifices Of The People
బడికెళ్లే పిల్లలతో కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. అంతేకాదు సౌకర్యాల లేమితో ఇబ్బంది పడుతున్న అనేక స్కూళ్లలో కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అల్పాహార పథకం కేవలం ఆర్భాటం కోసమే ప్రారంభించారని ఈ సందర్భంగా అన్నారు.
సీఎం చంద్రశేఖరరావుకు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి ఈ అంశాలను ప్రస్తావించారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించకపోవడం, పెరిగిన ధరలకు అనుగుణంగా వంట నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడం వంటి సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత, పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అల్పాహార పథకాన్ని కేసీఆర్(KCR) ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తుందని రేవంత్ గుర్తు చేశారు.
పెరిగిన జీతం విడుదల, కొత్త మెనూ బడ్జెట్ పెంపు, పెండింగ్ బిల్లులు విడుదల, జీఓ 8 ప్రకారం బకాయిలతో సహా పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి కేసీఆర్(KCR)ను కోరారు. కార్మికులకు ఐడీ కార్డులు, యూనిఫాంలు, ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. ఎక్కడా కూడా మెనూ ప్రకారం భోజనం అందడం లేదని ఆరోపించారు. సగం వండిన ఆహారం(food), నీరు అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలను తరచుగా వస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన ఆహారం కోసం విద్యార్థులు నిరసనలు తెలిపిన సంఘటనలు కూడా చూశామన్నారు. ఇలాంటి వాటిపై మీరు ఒక్కసారైనా సమీక్ష చేశారా అంటూ కేసీఆర్(KC) ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.